న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్.. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. కామెడీ తో కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా కథ ఇప్పటివరకు రాలేదు. టైటిల్ విషయానికొస్తే.. టైటిల్ ఏమో చిరంజీవి సినిమా టైటిల్ ..కథేమో కామెడీ అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 

ఆర్ జె గా మొదలైన నాని జీవితం సినిమాటోగ్రాఫర్ గాను అస్సిడెంట్ డైరెకర్ గాను , ప్రొడ్యూసర్ గాను ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్నా సంగతి తెలిసిందే..  అయితే అష్టాచమ్మా సినిమాతో సినీ అరంగ్రేటం చేసిన నాని చాలా వరకు హిట్ సినిమాలను అందించాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన కూడా అయన ఇప్పటికి సాధారణ జీవితం గడుపుతుండటం నాని ప్రత్యేకత. 

ప్రభాస్ సాహో సినిమా కారణంగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసుకున్నారు.. నిన్న రిలీజ్ అయినా ఈ సినిమా సాహో ను బీట్ చేసింది. యాక్షన్ కోణంలో వచ్చిన సాహో భారీ బడ్జెట్ తో వచ్చిన కూడా కలెక్షన్స్ రాబట్టింది కానీ జనాల్లోకి మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. నాని చిన్న సినిమా అయినా కూడా అందరి మనసును కామెడీ తో కొట్టిపడేసింది.
ఇకపోతే నాని సినిమాకు పోటీ ఇవ్వడానికి వరుణ్ నటించిన వాల్మీకి సినిమా రాబోతుంది. ఈ నెల ౨౦ న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నాని ఫుల్ కామెడీని రుచిచూపిస్తే .. వరుణ్ బాబు ఫుల్ వైలెన్స్ తో రాబోతున్నాడు. మరి ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయిగా చూడాలి .. వారం తేడాతో ఢీ  కొట్టబోతున్న ఈ సినిమాల రిజల్ట్ ఏంటో తెలియకుంటే వరుణ్ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: