నాని కి ఈ మధ్య వరుసగా ఫ్లాపులు వచ్చి పడుతున్నాయి. అన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్న జెర్సీ కూడా విమర్శకుల ప్రశంసలైతే దక్కాయి గాని కమర్షియల్ గా సక్సస్ ని అందుకోలేకపోయింది. దాంతో నాని కాస్త డిసప్పాయింట్ మెంట్ లో ఉండి చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. నిన్న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ వీకెండ్ మొత్తాన్ని బాగానే పట్టేసింది. పోటీ ఏదీ లేకపోవడం బాలీవుడ్ లో వచ్చిన  డ్రీం గర్ల్ - సెక్షన్ 375లకు డివైడ్ టాక్ రావడం మల్టీ ప్లెక్సుల పరంగా బాగా హెల్ప్ అవుతోంది . స్టోరీ రివెంజ్ డ్రామానే అయినప్పటికీ దాన్ని ఐదుగురు లేడీస్ గ్యాంగ్ తో ముడిపెట్టి హీరో పాత్రను సరదాగా తీర్చిదిద్దిన తీరుకు విక్రం కుమార్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఇందులో కొన్ని అంశాల గురించి మాత్రం నాని ని ప్రత్యేకంగా మెచ్చుకోక తప్పదు.

ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం తనతో సమానంగా విలన్ కార్తికేయకు స్పేస్ ఉందని తెలిసి ఓకే చెప్పడం అందులో ముఖ్యమైన అంశం. కథలో కీలక పాయింట్ తన మీద కాకుండా ఇతర పాత్రల చుట్టూ అల్లుకున్నా దాని గురించి ఆలోచించకుండా సినిమాని కమిటవడం రెండోది. అంతేకాదు ఎలాంటి మొహమాటం లేకుండా వెన్నెల కిషోర్ గే ఎపిసోడ్స్ ని చాలా ఈజ్ తో నడిపించడం. మాములుగా ఇలాంటి సీన్స్ లో నటించడానికి స్టార్స్ ఇబ్బంది పడతారు. కాని నాని చాలా ఈజీగా నటించేశాడు.

ఇక కొంతమంది హీరోలు బలవంతంగా కమర్షియల్ సాంగ్స్ పెట్టించుకుంటున్న సందర్భంలో అందుకు భిన్నంగా కేవలం సిచ్యువేషన్ కు తగ్గట్టు చాలాతక్కువ పాటలు ఉన్నా కూడా ఎస్ చెప్పడం ఇంకో ముఖ్య విశేషం. ఏది ఎలా ఉన్నా రిస్క్ చేసే విషయంలో నాని ఇప్పటికీ మారలేదని గ్యాంగ్ లీడర్ మరోసారి రుజువు చేసింది. జెర్సీలో కొడుకు కోసం ప్రాణం త్యాగం చేసే పాత్ర నుంచి లేడీస్ ని వెంటబెట్టుకుని పగ పగ అంటూ తిరిగే రోల్ చేయడం అందరి వల్లా అయ్యేది కాదు. కేవలం నేచురల్ స్టార్ వల్ల మాత్రమే సాధ్యపడే విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: