అక్కినేని అమల "మిథిలి ఎన్నై కాథాలి" అనే సినిమాతో తమిళ తెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఒవర్ నైట్ స్టార్ అయ్యారు.  తెలుగు తమిళ, హిందీ మరియు కన్నడ భాషల్లో దాదాపు 55 సినిమాల్లో  నటించారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించన శివ సినిమాలో నాగర్జున సరసన హీరోయిన్ గా నటించారు.  ఈ సినిమా సమయంలో వారి మధ్య ప్రేమ మొదలైంది.దాంతో రెండు సంవత్సరాల తర్వాత నాగర్జునను పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో బ్లూ క్రాస్ ని స్థాపించారు.వివిధ ప్రజా ప్రయోజన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.


అక్కినేని అమల తన ట్వీట్టర్ ఖాతా ద్వారా తన తల్లితండ్రులకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నా పేరెంట్స్ గురించి కొన్ని తప్పుడు కథనాలు వస్తున్నాయి.  అందుకే వివరణ ఇస్తున్నాను మా అమ్మగారు ఐరిష్ మహిళ.  అయితే చాలామంది భారతీయులకంటే మా అమ్మ గారి ఆత్మలోనే భారతీయత ఎక్కువగా కలిసిపోయిందని మా అత్తగారు అనేవారు.  మా నాన్నగారు భారతీయుడు. ఉత్తర ప్రదేశ్ లో పెరిగారు భారతీయ నౌకాదళంలో పని చేశారు. ఆయన  ఈస్ట్ బెంగాల్ లోని ఢాకా జన్నించారు. ఆ తరువాత ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ గా మారింది.  ఎవరైనా చరిత్రను అర్థం చేసుకోకపోతే.. వారు  దేశ విభజన వల్ల కలిగిన బాధను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కమాండర్ MK ముఖర్జీ ఒక  భారతీయుడు మరియు ఆయన ఒక బెంగాలి" అంటూ ట్వీట్ చేసింది.


జాతీయవాదం..దేశభక్తి అన్న పదాలకు కూడా విపరీత నిర్వచనాలు వెతుకుతున్న ఈ రోజుల్లో. విదేశీ మూలాలు ఉన్నవారు తమ దేశ భక్తి ని నిరూపించుకునే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అమల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ పైన అనే రూమర్స్ రావడం వల్ల ఆవిడ ఈ క్లారిటీ ఇచ్చిందని అందరు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: