తమన్నా అంటే మిల్కీ బ్యూటీ. ఈ ఏడాది తెలుగులో వచ్చిన ఎఫ్ 2 మూవీలో విక్ట‌రీ వెంకటేష్ పక్కన నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ మూవీలో తమన్నా తన సత్తా ఏంటో కొంత చూపించింది. అయితే ఇపుడు అమ్మడు మరింత గ్లామర్ డోస్ పెంచేసిందట. దాంతో చూడడానికి రెండు కళ్లు సరిపోతాయా అని కుర్రకారు గుండె లబ్ డబ్ మంటోందిట.  నిజానికి తమన్నా కు అందం లేదని ఎవరన్నారు. ఆమె తళుకు బెళుకులు పదేళ్ళుగా చూస్తునే ఉన్నారు. అయినా ఈ సొగసరి మరోసారి  మ్యాజిక్ చేయడానికి రెడీ అయిపోతోంది.


భామ‌సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న యాక్షన్ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.ఈ సినిమాలో తమన్నా బికినిలో అందాలు ఆరబోయడమే కాదు .. యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఇరగదీసిందట. ఈ మూవీలో తమన్న దర్యాప్తు అధికారిణి పాత్రలో నటిస్తోంది. దాంతో అటు యాక్షన్, ఇటు గ్లామర్ రెండూ కూడా అదిరిపోయే రేంజిలో ఉన్నాయట. ఈ మూవీలో బికినీలో తమన్నా చాటు మాటు అందాలన్నీ బయటేసి మరీ చాలెంజ్ అంటోందిట.



ఇక ఈ మూవీ విషయంలో తీసుకుంటే తమన్నా మళ్ళీ ఫామ్ లోకి రావాలనుకుంటోందట. అందువల్ల అవసరం  లేకపోయినా అందాలతో కనువిందు చేసిందని టాక్. మరి తమన్నా కేక పెట్టించి కాక పుట్టిస్తే చూసే వారికి ఎలా ఉంటుందో కదా. ఇక తమన్నా పెళ్ళి చేసుకుంటానని ఈ మధ్యే ప్రకటించింది. మళ్లీ ఈ గ్లామర్ డోసేంటని కూడా అంతా ఆశ్చర్యపోతున్నారు. మళ్లీ తమన్నా మనసు లాగిందా ఇలా వయసుతో పాటు అందాన్ని ఆరబోస్తోందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా విశాల్ మూవీ అంటే మినిమం గ్యారంటీ తెలుగులో కూడా ఉంది. పాజిటివ్ టాక్ వచ్చి మూవీ హిట్ అయితే తమన్నా మళ్ళీ ట్రాక్ లో పడినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: