చిరంజీవి తొలినాళ్ళ నుంచి చేసిన సినిమాలు ఆయన ఆలోచనల పదునెంతో తెలియజేస్తాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఎంచుకున్న పాత్రలు, చేసిన సినిమాలు అలాంటివి. చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రల నుంచి, విలన్ పాత్రలు చేస్తూ అవకాశాన్ని బట్టి హీరో పాత్రలు చేస్తూ వచ్చారు. అలా హీరోగా చేసిన ఓ హిట్ సినిమా కోతలరాయుడు. ఈ సినిమా విడుదలై నేటికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. చిరంజీవి కెరీర్లో మైలురాయిగా చెప్పుకోదగ్గ సినిమాల్లో కోతలరాయుడు కూడా ఒకటి.

 

 

 

ముఖ్యంగా ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవికి సోలో హీరోగా ఇది తొలి వంద రోజుల సినిమా కావడం విశేషం. ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాకు నిర్మాత. కె.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రాఘవులు సంగీతం అందించారు. ఈ సినిమాలో హీరోయిన్ మాధవిని ఆకట్టుకునేందుకు చేసే ప్రయత్నాల్లో చిరంజీవి మాటలు కోటలు దాటుతూంటాయి. చిరంజీవి యాక్టింగ్ లోని ఈజ్, స్పీడ్ కు ఇలాంటి సినిమాలు సోపానాలయ్యాయి. సినిమాలోని పాటల్లో, ఫైట్స్ లో తన స్పెషల్ చూపించారని నిర్మాత తమ్మారెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. డాన్స్, ఫైట్ మాస్టర్లు లేకపోయినా తానే సొంతంగా ఆయా మూమెంట్స్ చేసి ప్రేక్షకులని మెప్పించారని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ సినిమా కాన్సెప్ట్ కామెడీతో, సెంటిమెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని శతదినోత్సవ సినిమాగా నిలిచింది.

 

 

 

చిరంజీవి కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటన్నింటికీ పునాది ఈ సినిమానే అని చెప్పుకోవాలి. సోలో హీరోగా ఫస్ట్ హిట్, శతదినోత్సవం అంటే ఏ హీరోకైనా గొప్పే కదా. ఈ సినిమా నేటితో అరుదైన ఫీట్ సాధించడం మెగా అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమని చెప్పుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: