జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగిపోతోంది.కంటెస్టెంట్లనడుమ గొడవలు, రొమాంటిక్ ముచ్చట్లు,ఆశ్చర్య పరిచే పరిణామాలు, ఆసక్తి కలిగించే టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న బిగ్ బాస్.ఎపిసోడ్‌ లో హైలైట్ అయిన కొన్ని సంగతులు వాటిలోని రహస్యాలు మీ కోసం..ఇక చదవండి..



బిగ్ బాస్ హౌస్‌లో నిన్నటి వరకు వాళ్లిద్దరు ఉప్పు నిప్పులా చిటపటలాడుతుండేవారు,ఒకరిపై ఒకరు ఎప్పుడూ అరచుకుంటూ ఉండేవారు.కాని సడేన్‌గా ఏమైందో తెలియదు కానిం అలావున్నా వాళ్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది.సంథింగ్ సంథింగ్ నడుస్తోంది.లవ్ గాని పట్టాలెక్కుతుందో ఎమో ఇప్పుడు డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ ఓ రేంజ్‌లో నడుస్తోంది..బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున,గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందో లేదోనని తెలుసుకోవడానికి ఆ ఉప్పు నిప్పు ప్రేమ జంటకు పెద్ద పరీక్షపెట్టారు బిగ్ బాస్.అందుకోసం ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు.ఆ టాస్క్ లో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న టెలిఫోన్ బూత్‌కి ఫోన్ చేసి పునర్నవితో మీరు,ఈవారం ఎలిమి నేషన్‌కి డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారని దీనినుండి తప్పించుకోవాలంటే రాహుల్ మీకోసం 20 గ్లాస్‌ల కాకరకాయ జ్యూస్ తాగాలని అన్నారు.అప్పటికే పునర్నవితో గొడవపడి కోపంగా ఉన్న రాహుల్‌ని పిలిచి పునర్నవి నాకోసం కాకరకాయ జ్యూస్ తాగాలట తాగుతావా? అని అడిగింది..



అంతే ఎవ్వరూ ఊహించని సమాధానం నీకోసం కాకరకాయ రసం ఏంటి? విషం తాగమన్నా తాగేస్తా అని అందామనుకున్నాడు కావచ్చూ కాని చెబితే బాగుండదని వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాస్‌ల కాకరకాయ రసాన్ని పూన్నూ కోసం అమృతం తాగినట్టు తాగేశాడు.దీంతో రాహుల్‌ని దగ్గరకు తీసుకుని డీప్ హగ్ ఇవ్వడమే కాకుండా గాలి కూడా చొరబడనంతగా హద్దుకుని ఘాటు ముద్దు ఇచ్చేసింది పునర్నవి..అంతే తను చేసిన త్యాగానికి ఫలితం వచ్చిన వాడిలా నవ్వు ముఖం పెట్టాడు రాహుల్. అప్పటివరకు అనుమానంగా వున్న వీళ్ల లవ్వుట్రాక్ ఒకరికొకరికి తెలియకుండా యమ స్పీడ్‌గా పరిగెడుతుందని అర్ధమైందట అక్కడున్న మిగతా వారికి  


మరింత సమాచారం తెలుసుకోండి: