అసిస్టెంట్ డైరక్టర్ గా చేసిన అభి (అధర్వ) ఎలాగైనా ఓ సూపర్ హిట్ సినిమా తీయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఓ రియల్ గ్యాంగ్ స్టర్ కథను తెరకెక్కించాలని అనుకుంటాడు. అలా అనుకున్న అతనికి గద్దలకొండ గణేష్ తారసపడతాడు. ఇక ఆ దర్శకుడి ఫొకస్ గణేష్ మీద పడుతుంది. తీస్తే ఇతని జీవితాన్నే సినిమాగా చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో గణేష్ కు దగ్గరవుతాడు అభి. గద్దలకొండ గణేష్ ఎందుకు అలా మారాల్సి వచ్చింది..? అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? దర్శకుడి కావాలనుకున్న అభి,గణేష్ ను ఎందుకు ఎంచుకున్నాడు..? దర్శకుడు ఆ సినిమా పూర్తి చేశాడా..? చివరకు గణేష్ ఎలా మారాడు అన్నది సినిమా కథ.
రీమేక్ సినిమాలను తీసే విధానం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సినిమా లైన్ ను మాత్రమే తీసుకుని మన ప్రేక్షకుల ఆలోచనలను బట్టి కథనం రాసుకోవడం.. లేదా మక్కీకి మక్కీ దించేయడం. గద్దలకొండ గణేష్ సినిమా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా తెరకెక్కింది. అయితే సినిమా రీమేక్ చేసిన హరీష్ శంకర్ నెగటివ్ రోల్ చేసిన వరుణ్ తేజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు
సినిమా అంతా వరుణ్ తేజ్ క్యారక్టరైజేషన్.. అతని స్టైల్.. లుక్ వీటిలో తన మార్క్ కనిపించేలా చేశాడు. ఒరిజినల్ లో బాబీ సింహాని మించేలా వరుణ్ తేజ్ లుక్ ఉందని చెప్పొచ్చు. ఇక హరీష్ శంకర్ మార్క్ కామెడీ కూడా సినిమాలో ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం కాస్త డిస్ట్రబ్ చేస్తాయి.
ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, వరుణ్ తేజ్ పూర్తిస్థాయి మేకోవర్ మెగా ఫ్యాన్స్ కు మాస్ ఆడియెన్స్ కు కిక్ ఇస్తాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ ను ఇలా చూపించినందుకు హరీష్ గట్స్ ను మెచ్చుకోవాల్సిందే. ముకుంద నుండి ఎఫ్2 వరకు అన్ని సాఫ్ట్ పాత్రలే వేసిన వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ గా అదరగొట్టేలా చేశాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ అదిరిపొయే పర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.