మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్ తరహా పాత్రల్లో నటించి మెప్పించిన వరుణ్ తేజ్, ఈ సినిమాలో తొలిసారి గద్దలకొండ గణేష్ అనే మంచి మాస్ క్యారెక్టర్ లో నటించి అదరగొట్టినట్లు తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఎంతో ప్రెతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఈ సినిమాను ఇటీవల వచ్చిన జిగర్తాండ అనే తమిళ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కించారు. 

అయితే ఆ తమిళ సినిమాను ఫస్ట్ హాఫ్ పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా తెరకెక్కించిన దర్శకుడు, సెకండ్ హాఫ్ లో మాత్రం మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఆకట్టుకునే విధంగా కొన్ని మార్పులు చేయడం జరిగిందట. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు హరీష్ ఎక్కువగా మంచి ఎంటర్టైనింగ్ వే లో తెరకెక్కించారని చెప్తున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ స్పెల్ బౌండింగ్ పెరఫార్మన్క్ తో పాటుగా దర్శకుడు హరీష్ శంకర్, టేకింగ్ పరంగా మరొక దర్శకుడు పూరీని, అలానే లొకేషన్స్ విషయంలో రామ్ గోపాల్ వర్మ మాదిరి నాచురల్ లొకేషన్స్, ఇక కామెడీ పరంగా శ్రీను వైట్ల మాదిరిగా కడుపుబ్బా నవ్వించే కామెడీ స్టైల్ ని ఎంచుకుని, వాటన్నిటిని కలగలిపి ప్రేక్షకుడిని ఆకట్టుకునే రీతిలో ఈ గద్దలకొండ గణేష్ ని తెరకెక్కించడం జరిగిందట. 

ఇకపోతే సినిమాలో హీరోయిన్ గా నటించిన పూజ హెగ్డే సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుందని, అలానే ఆమె తన క్యారెక్టర్ కు నూటికి నూరు శతం న్యాయం చేసిందని అంటున్నారు. ఇక ఈ ఇద్దరితోపాటు అధర్వ, మృణాళిని, బ్రహ్మాజీ, సత్య తదితరులు సినిమాలో తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే ఈ గద్దలకొండ గణేష్ సినిమాతో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతోపాటు థియేటర్ కు వచ్చిన ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచిందని తెలుస్తోంది......!! 


మరింత సమాచారం తెలుసుకోండి: