మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంతకాలంగా చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ముకుంద సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ మొదటి సినిమాతోనే హీరో మెటీరియల్ అని అనిపించుకున్నాడు. అంతేకాదు మెగా హీరోలకు ఏమాత్రం తీసిపోడని ఆ సినిమాతోనే ప్రూవ్ చేసుకోవడమేకాదు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కంచె సినిమాతో క్లాస్ హీరోగా మంచి సక్సస్ ను అందుకున్నాడు. అంతరిక్షం, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో ఆ సక్సస్ రేంజ్ ను మరింతగా పెంచుకున్నాడు. అయితే ఇవన్ని కూడా క్లాస్ సినిమాలే. వరుణ్ ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాస్ హీరోగా 
ఏ డైరెక్టర్ కూడా చూపించలేదు. 

వాస్తవంగా చూస్తే మెగా హీరోలందరు మాస్ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగాస్టార్, పవర్ స్టార్ కి తెలిసినంతగా మాస్ పల్స్ ఇండస్ట్రీలో మరే హీరోకి తెలియదనే చెప్పొచ్చు. ఇక వరుణ్ ను కంప్లీట్ కొత్త మేకోవర్ తో హరీష్ శంకర్ చాలా కొత్తగా తయారు చేశాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి వరుణ్ తేజ్ గెటప్ గురించే ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా మాట్లాడుకున్నారు. వాల్మీకి టైటిల్ కంటే వరుణ్ గెటప్ అందరిని అమితంగా ఆకట్టుకుంది. ఇక టీజర్. ట్రైలర్ తో మెగా ఫ్యాన్స్ కి ఎప్పుడెప్పుడు వరుణ్ ని థియోటర్స్ లో చూస్తామా అన్న ఆతృత విపరీతంగా మొదలైంది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన్ వాల్మీకి కూడా గబ్బర్ సింగ్ కి ఏమాత్రం తగ్గకుండా అంచనాలను పెంచేశాడు. 

ఇక ఈరోజు థియోటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకుంది. ముఖ్యంగా వరుణ్ గద్దలకొండ గణేష్ గా అలరిస్తున్న తీరు బావుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఇలాంటి మాస్ క్యారెక్టర్ ప్రయత్నించని వరుణ్.. గణేష్ పాత్రలో ఒక్కసారిగా మాస్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. ఈ ఒక్క క్యారెక్టర్ తో మెగా హీరోల మాస్ ఇమేజ్ ని వరుణ్ తెచ్చుకోవడం విశేషం. ఇక సినిమా మొత్తం వరుణ్ తన భుజాల మీదే మోసాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ క్యారెక్టర్ లో వరుణ్ ని చూసిన ప్రేక్షకులు ఎలాంటి మాస్ క్యారెక్టర్ అయినా ఈజీగా చేయగల సత్తా వరుణ్ కి ఉందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి వరుణ్ చేసిన ఈ ఎక్స్‌పరిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. ఇక దర్శకులు వరుణ్ కోసం మాంచి మాస్ క్యారెక్టర్స్ రాసుకోవడం పక్కా అని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: