మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు గద్దలకొండ గణేష్ గా వచ్చాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో పూజా హెగ్దె, మృణాళిని హీరోయిన్స్ గా నటించారు.  


సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా వరుణ్ తేజ్ కు సమానమైన రోల్ చేశాడు. వాల్మీకి టైటిల్ తో ప్రమోట్ అయిన ఈ సినిమా చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా టైటిల్ మార్చారు. ఇక సినిమా విషయానికొస్తే వరుణ్ తేజ్ గణేష్ పాత్రలో గడగడలాడించాడు. తనలో ఇంత ఫైర్ ఉందని మాస్ కా బాప్ అనిపించే మెటీరియల్ అని ఈ పాత్రతో ప్రూవ్ చేసుకున్నాడు.         .


గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన మిగతా మెగా హీరోల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ ల నటనని వారసత్వంగా చేసుకుని వరుణ్ తేజ్ మాస్ ప్రేక్షకులను మెప్పించేశాడు. గణేష్ పాత్రకు తగిన యాటిట్యూడ్ తో అదరగొట్టాడు.


మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ లో ఈ సినిమా ఈ పాత్ర నిలిచిపోతాయని చెప్పొచ్చు. సినిమాలో వరుణ్ తేజ్, పూజా హెగ్దెల లవ్ ఎపిసోడ్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక మరో హీరోయిన్ గా నటించిన మృణాళిని కూడా తన నటనతో ఇంప్రెస్ చేసింది. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నట విశ్వరూపం చూపించేశాడు. మిగతా స్టార్స్ కు తానేం తీసిపోనని ప్రూవ్ చేసుకున్నాడు.            



మరింత సమాచారం తెలుసుకోండి: