టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో ఇటీవల రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిన ప్రమాణాలతో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమాలో కేవలం భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ కి ఇచ్చిన  ప్రాధాన్యత, ఆకట్టుకునే కథ, కథనాలకు ఇవ్వలేదనే వాదన విపరీతంగా ప్రచారం అయింది. 

ఇక ప్రస్తుతం సాహో చాలా చోట్ల క్లోజింగ్ పరిస్థితికి వచ్చేసింది. కేవలం నార్త్ లో మాత్రమే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ లభించగా, దాదాపుగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ సినిమా నష్టాలను చవిచూసే పరిస్థితి తలెత్తింది. బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాను యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కించగా, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, తమిళ నటుడు అరుణ్ విజయ్, మరొక బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించడం జరిగింది. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25 వ సినిమా అజ్ఞాతవాసి, 

ఇప్పటివరకు రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాల్లో అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా ప్రధమ స్థానంలో నిలవగా, దాని తరువాత సాహోనే రెండవ స్థానాన్ని ఆక్రమించిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఇక్కడ వారు చెప్తున్న ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, అప్పట్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాను లార్గో వించ్ అనే ఫ్రెంచ్ సినిమా  కథను కాపీ కొట్టి తీసినట్లు అప్పట్లో వార్తలు ప్రచారం అయి, విపరీతంగా విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వచ్చిన సాహో కూడా అదే విధమైన కథతో తెరకెక్కి విమర్శల బారిన పడింది. ఈ విధంగా ఒకే సినిమా కథను కాపీ కొట్టి బయ్యర్లకు అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన ఈ రెండు సినిమాలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: