విజయ్ దేవరకొండ…యూత్ పాలోయింగ్ ఎక్కువే. అయితే యూత్ పాలోయింగ్ అధికంగా ఉండటంతో వారు కనెక్టు అయ్యే సినిమాలను చేయాలనుకుంటున్నాడు విజయ్. అయితే లేటెస్ట్‌గా వచ్చిన 'డియర్ కామ్రేడ్' డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం, కొత్త దర్శకులతో సినిమాను ఒప్పుకొని, చివరకు ఆ సినిమాకు పెద్దగా పేరు కాపోవడం, దాన్ని మధ్యలో ఆపేయడం లాంటివి విజయ్ కాన్ఫిడెన్స్ కాస్త దెబ్బతిందా? అంటే అవుననే అనుమానాలు వస్తున్నాయి.   అందుకే పూరి జగన్నాథ్‌తో 'ఫైటర్' అనే సినిమా చేయనున్నట్లు కూడా టాక్ వచ్చింది.

 

Image result for world famous lover

విజయ్ దేవరకొండ విజయతీరాల్లో ఉన్నప్పుడు క్రాంతి మాధవ్‌తో ఒక మూవీకి ఒకే అన్నాడు. అదే మూవే 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఆ సినిమా టైటిల్ ముందు చాలా డిఫరెంట్‌గా ఉందనిపించినా…మెల్ల మెల్లగా అందరికీ కనెక్టు అయిపోయింది..అయితే ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అయితే ఆ ఫస్ట్‌లుక్ విడుదలైనా…అందులో పెద్దగా కొత్తదనం లేదనే విషయం నెటిజన్ల నుంచి టాక్ వస్తోంది. ఎందుకంటే విజయ్‌ని యూత్‌కి బాగా కనెక్టు చేసిన మూవీ 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాకు సంబంధించినవి ఇందులో చాలా ఉన్నాయనేది యూత్ అంటున్న మాట. హెయిర్ స్టైల్ కూడా అర్జున్ రెడ్డినే గుర్తు చేస్తుందని చెప్పాలి. ఇక ముఖంపైన రక్తంతో గాయాలు, నోట్లో సిగరెట్ పొగ, చేతిలో వెలుగుతున్న సిగరెట్...ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చే సినిమా అర్జున్ రెడ్డి. అందుకే అర్జున్ రెడ్డి మూవీ లాగానే ఉంటుందేమోనని నెటిజన్లు ఫిలవుతున్నారు. అయితే ఈసినిమా విడుదలైన తర్వాత ఎలా ముందుకు పోతుందనే విషయం పక్కనపెడితే … సోషల్ మీడియాలో మాత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫస్ట్‌లుక్‌పై ఒక రేంజ్‌లో ట్రోలింగ్ కొనసాగుతోంది. ఇదే కాదండోయ్.. ఈ మూవీలో నలుగురు హీరోయిన్లు. దీనిపై కూడా యూత్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.

Image result for world famous lover

మరింత సమాచారం తెలుసుకోండి: