నటి భానుప్రియ పనిమనిషి కేసులు ఆమెను వెంటాడుతూనే ఉంది. ఇంటి పనికోసం బాలికను నియమించుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ నటి భానుప్రియపై చెన్నైలో కేసు నమోదైంది. చెన్నైలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న భానుప్రియ ఇంటి పనికోసం ఏపీలోని సామర్లకోటకు చెందిన బాలికను నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   గతంలో మైనర్ బాలికను పనిలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేశారని.. భాను ప్రియ సోదరుడు లైంగికంగా వేధించాడని బాలక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. బాలిక  సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీ బజార్ పోలీసులు అరెస్టు చేశారు.తూర్పుగోదావరిజిల్లా సామర్ల కోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భాను ప్రియ నివాసంలో పనికి పెట్టారు. ఈ నేపథ్యంలో భాను ప్రియ సోదరుడు పని అమ్మాయిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడని ఆరోపించారు..తను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించగా తాను దొంగతనం చేశావంటూ మరోరకంగా వేధించడం మొదలు పెట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ఈ విషయమై సామర్లకోట పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసు చెన్నై పోలీసులకు బదిలీ అయింది.ఈ ఏడాది జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్ ఫిర్యాదు చేస్తూ.. తమ ఇంట్లోని పని అమ్మాయి చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బాలికపై కేసు నమోదు చేయాలని కోరారు. కాగా, బాలికను ఇంటికి పంపడం లేదని.. లైంగికంగా వేధిస్తూ.. చిత్ర హింసలు పెడుతున్నారని,... కనీసం తల్లితో ఫోన్ లో కూడా మాట్లాడనివ్వడం లేదని బాలిక తల్లి భానుప్రియపై కేసు పెట్టింది. దీంతో బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేసుకున్న సామర్లకోట పోలీసులు చెన్నై వెళ్లి భానుప్రియను విచారించారు.

మరోవైపు, చెన్నైలో భానుప్రియ పెట్టిన కేసులో ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు. తాజాగా ప్రభావతి పెట్టిన కేసును సామర్లకోట పోలీసులు చెన్నైకి బదలాయించారు. నేరం జరిగింది చెన్నైలో కాబట్టి అక్కడి పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో చెన్నై పోలీసులు భానుప్రియ, ఆమె సోదరుడిపై మరోమారు బాలకార్మిక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో వారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై భానుప్రియ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: