చి ల సౌ సినిమా తో దర్శకుడి గా మారి తన ట్యాలెంట్  ను నిరూపించుకున్నాడు  రాహుల్ రవీంద్రన్.  యాక్టర్ గా  తనకు రాని పేరును  ఈ ఒక్క సినిమాతో  తెచ్చుకున్నాడు. ఈచిత్రం పెద్దగా  కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయినా...  రాహుల్ ఈసినిమాను డీల్ చేసిన విధానం  ప్రేక్షకులను  ఫిదా చేసింది. ఇక ఈ సినిమా చూసి ఇంప్రెస్ అయిన  స్టార్  హీరో నాగార్జున , రాహుల్ కు  తన తో  సినిమా చేసే బంపరాఫర్ ఇచ్చాడు.  దీన్ని సరిగ్గా వాడుకొనివుంటే  రాహుల్ దశ తిరిగేదే.  కానీ  ఇక్కడే అతను తేలిపోయాడు.  నాగార్జున లాంటి  హీరో దొరికినప్పుడు  మంచి కథను రాసుకొని , ఆకథతో నాగ్ ను ఒప్పించి  సినిమా చేయాల్సింది.  కానీ ఓ  విదేశీ సినిమా ను తీసుకొని  దాన్ని కొంచెం  అటు ఇటు గా మార్చి  దానికి మన్మథుడు 2 అనే టైటిల్ ను పెట్టి  చిన్నపాటి బిగ్రేడ్ సినిమాను తెరకెక్కించాడు. 


నాగ్ కెరీర్ లో మన్మథుడు ఓ కల్ట్ సినిమా. ఆ టైటిల్ పెట్టే సరికి  జనాల్లో సినిమాఫై  అంచనాలు విపరీతంగా పెరిగాయి.  కానీ ఆ అంచనాలకు దరిదాపుల్లో కూడా  రాలేకపోయింది మన్మథుడు 2. ఇదే  నాగ్ ఫ్యాన్స్ కు  మండేలా చేసింది.  దాంతో సినిమా విడుదలయ్యాక  మా హీరో కు ఇలాంటి సినిమాను ఇస్తావా అని రాహుల్ ను  ఓ రేంజ్ లో ఏసుకున్నారు.  అయితే అంతా  మర్చిపోతున్న సమయం లో  తాజాగా మన్మథుడు 2 నెట్ ఫ్లిక్స్ లో  విడుదలవుతుంది అందరూ  చూడండి అంటూ ట్వీట్ చేశాడు రాహుల్.  ఆ ట్వీట్ చూసిన నాగ్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయి  తమ కోపాన్ని కామెట్ల రూపంలో చూపిస్తున్నారు. అదో అద్భుత కళా ఖండం దాన్ని  మేము చూడాలా , మా నాగార్జున కు చెత్త సినిమా ఇచ్చావ్ అని  రాహుల్ ఫై విరుచుకుపడుతున్నారు.  ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే  ఒక్కరు కూడా రాహుల్ మద్దతుగా నిలువలేదు.  కామెంట్లు అన్ని నెగిటివ్ గానే  వస్తున్నాయి.  అలా   అనవసరంగా  మళ్ళీ సినిమా గురించి ట్వీట్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైతున్నాడు రాహుల్ రవీంద్రన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: