పాయల్ రాజ్ పుత్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ భామ.. ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అమ్మడి అందాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఆరెక్స్ 100 హీరోయిన్ తాజాగా ఎర్ర గౌనుతో అదరగొట్టేసింది. మెరిసే జిల్ జిల్ డ్రెస్ లో హొయలుపోతూ ఫోజులిచ్చింది.


అసలే పాలమీగడ లాంటి అందం.. దానికి తోడు.. అందాల ప్రదర్శనతో డ్రెస్ అదిరిపోయిందిఈ హాట్ డ్రస్సుతో ఇన్ స్ట్రా గ్రామ్లో ఫోటో పిక్ పెట్టింది. ఈ ఫోటోకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రాబోయే ఆర్డీఎక్స్ లవ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.


ఇక తన తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్ గురించి చెప్పాల్సి వస్తే.. . ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి కూడా హీరోయిన్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన ఆధారంగానే సాగింది. ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ సినిమా నిర్మిస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో వస్తోంది.


మొదట్లో పాయల్ రాజ్ పుత్ ను ఓ అందాల నెరజాణగా చూపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేశారు. కేవలం పాయల్ రాజ్ పుత్ అందాలనే పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్నారా అనిపించారు. ఆ తర్వాత వచ్చిన టీజర్లోనూ అంతా బూతు కామెడీయే పెట్టడంతో ఇదేదో అడల్డ్ కామెడీ మూవీ అనిపించారు.


కానీ ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అసలు కథను రివీల్ చేస్తున్నారు సినీ నిర్మాత, దర్శకులు. థియేట్రికల్ ట్రైలర్ చూసినవారికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఉన్న జోనర్ కాకుండా కొత్త జోనర్ లో ఈ సినిమా సాగుతుందా అనిపిస్తోంది. తాజా ట్రైలర్ చూసిన వారికి ఇదో ఊరి సమస్యపై తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: