పాయల్ రాజ్ పుత్.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ హాట్ భామ.. ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అమ్మడి అందాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఆరెక్స్ 100 హీరోయిన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఆకట్టుకుంటోంది. సాధారణంగా పాయల్ అంటే అందాల ఆరబోతే అనుకుంటారు.


కానీ తానూ ఓ సాంప్రదాయమైన అమ్మాయిలా సింగారించుకుంటే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ ఫోటోలో తాను అలాగే ఉంది మరి. అందమైన సాంప్రదాయబద్దమైన కట్టూబొట్టుతో కుర్రాళ్లు షికార్ల కోసం కాకుండా.. పెళ్లి కోసం ఎదురు చూసే అమ్మాయిలా అదరగొట్టేసింది. తల్లో మల్లెపూలు.. నడుముకు వడ్డాణం.. కంచిపట్టు చీర.. మెడలో హారం.. ఈ అదాలకు తోడు సిగ్గు..


అసలే పాలమీగడ లాంటి అందం.. దానికి తోడు.. కంచిపట్టు బొమ్మలా సంప్రదాయమైన డ్రెస్ అదిరిపోయింది. ఈ డ్రస్సుతో ఇన్ స్ట్రా గ్రామ్లో ఫోటో పిక్ పెట్టింది. ఈ ఫోటోకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇక తన తాజా చిత్రం ఆర్డీఎక్స్ లవ్ గురించి చెప్పాల్సి వస్తే.. . ఈ సినిమా


ప్రమోషన్ మొదటి నుంచి కూడా హీరోయిన్ రాజ్ పుత్ అందాల ప్రదర్శన ఆధారంగానే సాగింది. ఆరెక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్ పుత్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ సినిమా నిర్మిస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కూడా అదే రేంజ్ లో వస్తోంది. మొదట్లో పాయల్ రాజ్ పుత్ ను ఓ


అందాల నెరజాణగా చూపిస్తూ పోస్టర్లు రిలీజ్ చేశారు. కేవలం పాయల్ రాజ్ పుత్ అందాలనే పెట్టుబడిగా పెట్టి సినిమా తీస్తున్నారా అనిపించారు. ఆ తర్వాత వచ్చిన టీజర్లోనూ అంతా బూతు కామెడీయే పెట్టడంతో ఇదేదో అడల్డ్ కామెడీ మూవీ అనిపించారు. కానీ ఇది ఓ ఊరి కోసం తీసిన సినిమా అట.


మరింత సమాచారం తెలుసుకోండి: