ఆకలి మీద ఉన్న మెగా అభిమానులకు సైరా సినిమాతో ఫుల్లుగా భోజనం చిరంజీవి మరియు రామ్ చరణ్ చూపించారు. సైరా సినిమా చూసిన ప్రతి ఒక్కరు అప్పట్లో ఇంద్ర ఇప్పుడు సైరా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు. మెగా కుటుంబం గుర్రం ఎక్కితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు మొత్తం పగలటం ఖాయమని మరొక సారి రుజువు చేశారని సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు అభిమానులు చెబుతున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత చిరంజీవి వెండితెరపై కనిపించడంతో సినిమా అదిరిపోయే రీతిలో సురేందర్ రెడ్డి తెరకెక్కించడం తో సైరా సినిమా కి క్యూ కడుతున్నారు.


మొదటి సినిమాతోనే అద్భుతమైన బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది సైరా. ఇదిలా ఉండగా మొట్టమొదటి రోజే బాహుబలి రికార్డులను బద్దలు కొట్టేసింది. ఓవరాల్ గా బయట కలెక్షన్లు ఎలా ఉన్న తెలియదు గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వసూళ్ళ పరంగా లెక్కలు చూస్తుంటే బాహుబలి 2 సినిమాకి వచ్చిన కలెక్షన్లు మొదటిరోజే రికార్డు స్థాయిలో సైరా సినిమా రాబట్టినట్లు సమాచారం. బాహుబలి 2 ఆ రికార్డ్ అందుకోవడానికి బాహుబలి 1 ఎంతగానో ఉపయోగపడింది.


కానీ సైరా సోలో ఎటాక్ చేసేందుకు సిద్ధమైంది. మెగాస్టార్ క్రేజ్ మాత్రమే సినిమాకు హెల్ప్ అవుతోంది. ప్రీమియర్ షోలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మొదటిరోజు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సినీ ఎనలిస్ట్ ల అంచనా ప్రకారం ఫస్ట్ డే 40 కోట్ల నుంచి 45కోట్లవరకు కలెక్షన్స్ ఇప్పటికే రాబట్టినట్లు కూడా వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద చిరంజీవి సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం తో టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర ఉన్న రికార్డులు మొత్తం తారుమారు అవ్వడం ఖాయమని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: