టాలీవుడ్ యంగ్‌ సంచలనం విజయ్ దేవరకొండ అంటే యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినా తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు తక్కువ సమయంలోనే ఇతర రంగాలవైపు కూడా అడుగు పెట్టేశాడు. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపారం రంగం వైపు కూడా దృష్టి పెట్టాడు.


ఆయన ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో దుస్తుల వ్యాపారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రౌడీ వేర్ కు ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా తీసిన స్టిల్స్ ఇప్పుడు అదరగొడుతున్నాయి. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు. తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ కోసం చేసిన ఫొటో షూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.


విజయ్ ఇప్పటికే తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్ర వేశాడు. ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం.


తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. సినిమాల క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవడం అంటే ఇదే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: