`నిను వీడ‌ని నీడ‌ను నేనే` చిత్రంతో సూప‌ర్‌హిట్ సాధించిన యువ క‌థానాయకుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్‌`. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ లుక్‌లో ఓ స్టేడియం ముందు సందీప్ కిష‌న్ చేతిలో హాకీ స్టిక్‌ను ప‌ట్టుకుని ఉన్నారు. హాకీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్ర‌మిది.


ఈ చిత్రానికి డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. హిప్ హాప్ త‌మిళ  సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ మొద‌టి వారంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.
ద‌ర్శ‌క‌త్వం:  డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను,నిర్మాత‌లు: టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం, స‌హ నిర్మాత‌:  వివేక్ కూచిభొట్ల, మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌.


ఇక‌పోతే ‘నిను వీడని నీడను నేనే’ వంటి డీసెంట్ హిట్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్’. హన్సిక మోత్వానీ హీరోయిన్‌. వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యపాత్రలో నటించారు.ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ విడుదల వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.  మ‌రి ఈ ఎ1 ఎక్స్‌ప్రెస్ వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌లాగా అంత మంచి హిట్ అవుతుందా అలాగే ఈ మ‌ధ్య కాలంలో  స్పెర్ట్స్ నేప‌ధ్యంలో వ‌చ్చే క‌థ‌ల‌కి ఈ క‌థ తేడా ఏంటి అన్న విష‌యాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: