స్టార్ హీరో సాక్ష్యంగా ఓ క్రేజీ సింగర్ తో హీరోయిన్ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో హాట్ న్యూస్ గా మారింది. ఇది ఎక్కడో జరిగింది కాదు బిగ్ బాస్ హౌజ్ లో జరిగిన విషయమే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోయిన్ పునర్నవిల మధ్య సంథింగ్ సంథింగ్ అని తెలిసిందే.


ఇద్దరు ఒకరితో ఒకరు చెప్పుకోలేదు కాని దాదాపు వారిద్దరు ప్రేమలో ఉన్నారని హౌజ్ మెట్స్ అంతా కన్ఫాం చేశారు. పునర్నవి, రాహుల్ మధ్య నడుస్తున్న ఈ కెమిస్ట్రీని కింగ్ నాగార్జున కనిపెట్టేశాడు. ఆదివారం పునర్నవి ఎలిమినేట్ అవగా రాహుల్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే వీరిమధ్య ప్రేమను కనిపెట్టేందుకు పునర్నవి వెళ్లేప్పుడు రాహుల్ ను పాట పాడమని అడిగారు నాగార్జున.  


మనసంతా భారంగా ఉన్నా నాగార్జున అడిగాడని రాహుల్ ఏమైపోయావే సాంగ్ పాడటం మొదలు పెట్టాడు కాని సాంగ్ పూర్తిగా పాడలేదు. ఆ క్షణంలో రాహుల్ బిగ్గరగా ఏడ్చేశాడు. పునర్నవి మీద తనకున్న ఎఫెక్షన్ ను రాహుల్ అలా చూపించాడు. అయితే రాహుల్ మనసులోని భావాలను కనిపెట్టిన నాగార్జున బిగ్ బాస్ ను అడిగి వెళ్లిపోమాకే సాంగ్ వేయించాడు.    


అలా నాగార్జున ముందే రాహుల్, పునర్నవిల మధ్య ఉంది స్నేహం కాదు దాన్నిమించి అనేలా చూపించారు. పునర్నవి ఎలిమినేట్ అయిన వెంటనే రాహుల్ షాక్ అవగా ఆ బాధ అలా ఉంచుకుని ఒక్కసారైగా పాట పాడమని చెప్పినప్పుడు బయట పెట్టాడు. మరి బయటకు వచ్చాక ఈ ఇద్దరు స్నేహితులుగా ఉంటారో.. లవ్ బర్డ్స్ గా మారుతారో చూడాలి. అయితే బిగ్ బాస్ హౌజ్ లో ఫైన రేసుకు దగ్గపడుతున్నా కొద్ది టాస్కులు టఫ్ చేస్తున్నారు. మరో మూడు వారాలు నామినేషన్స్ ఉండగా ఈ నామినేషన్స్ టైం లో అలర్ట్ గా ఉండాలని హౌజ్ మెట్స్ ఫిక్స్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: