భారీ అంచనాల మధ్య అతి భారీ బడ్జెట్ తో బాహుబలి తర్వాత తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రభాస్ చిత్రం 'సాహో'. భారత దేశ వ్యాప్తంగా ప్రభాస్ బాక్సాఫీస్ సత్తాను చాటి చెప్పిన చిత్రం కూడా ఇదే. తెలుగు మరియు మిగిలిన భాషలలో ఈ సినిమా చాలా వరకు నష్టాలనే మిగిల్చింది కానీ హిందీ లో మాత్రం దుమ్ము దులిపింది. అక్కడ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాల్ని మిగిల్చిన ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 40 రోజులు అవుతుంది. శ్రద్ధ కపూర్, జాకీష్రాఫ్, ప్రభాస్ మరియు ఎంత మంది బాలీవుడ్ తారాగణం నటించిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడం మరియు విడుదల సమయంలో హాలిడేస్ ఎక్కువ లేకపోవడంతో చాలా మంది ఈ సినిమాను థియేటర్లలో చూడడం మిస్ అయ్యారు.

అలా సాహో ని థియేటర్లో చూడని వారికి ఒక గుడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లోనే సాహో సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్త్రీమ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలామంది ఒకసారి చూస్తే సినిమా అర్థం కావట్లేదని రెండోసారి చూస్తేనే సినిమా లో ఉన్న కంటెంట్ తెలుస్తుందని అన్నాడు. అందుకే మొదటి సారి చూసినప్పుడు నచ్చని వారంతా రెండవసారి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ఆప్ లో ఇప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికోసమే ఈ సినిమాను వీలైనంత త్వరగా 'అమెజాన్ ప్రైమ్' లో వదిలే ఏర్పాట్లు చేశారు.

అక్టోబర్ 23 వ తారీఖున యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.అమెజాన్ ప్రైమ్ లో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుండగా హిందీ లో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో వీడియో విడుదల అవుతుంది. థియేటర్ దగ్గర అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయిన ఈ చిత్రం ఆన్లైన్ లో కొత్త రికార్డులు ఏమైనా తిరగరాస్తుందేమో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: