తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు కొత్త దారులని వెతుకుతూ తెలుగు సినిమా దశా, దిశను మార్చే ప్రయత్నం చేస్తుండగా, పెద్ద పెద్ద దర్శకులు సైతం నూతనంగా ఆలోచిస్తూ సరికొత్త దారిలో పయనిస్తున్నారు. తద్వారా తెలుగులో మంచి పోటీ వాతావరణమ్ నెలకొంది. అయితే ఆ దర్శకులు కొత్త కథలే కాదు.. కొత్త ప్రయోగాలు కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు.


తమ సినిమా ద్వారా హీరోలని పరిచయం చేయడమే కాదు, కథ నచ్చితే తామే హీరోలుగా అవతారమెత్తుతున్నారు. మొన్నటికి మొన్న హీరో నుండి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ ని చూసి ఇదేంటని ఆశ్చర్యపోయాం. అయితే ఇప్పుడు దర్శకులే తెర ముందుకు వచ్చి సందడి చేయబోతున్నారు. పెళ్ళి చూపులు లాంటి న్యూ ఏజ్ సినిమాతో తెలుగు సినిమాకు ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్.


ఈ దర్శకుడు ప్రస్తుతం "మీకు మాత్రమే చెప్తా" నంటూ హీరోగా కనిపించబొతున్నాడు. ఈ సినిమా విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్ పై నిర్మిస్తుండా కొత్త కుర్రాడు సమీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెళ్ళి చూపులు ద్వారా హీరోగా పరిచయమైన విజయ్ కి నిర్మాతగా ఇదే మొదటి చిత్రం. తన చిత్రం ద్వారా  విజయ్ స్టార్ హీరోగా తీర్చిదిద్దిన తరుణ్ కి విజయ్ ఇచ్చే గిఫ్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


ఇక మరో సీనియర్ దర్శకుడు వివి వినాయక్ మొదటిసారిగా లీడ్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేశారు. " ఈ సినిమాకి "సీనయ్య" అనే టైటిల్ ని పెట్టారు. అయితే ఈ సినిమా ద్వారా వినాయక్ హీరోగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ఒకవేళ ఈ ఇద్దరు దర్శకులు నటులుగా సక్సెస్ అయితే మరికొంత మంది దర్శకులు నటులుగా మారే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: