చిన్నారి పెళ్లి కూతురు ధారావాహిక  తో బుల్లితెరపై మెరిసిన   అవికాగోర్... ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమా తోనే  మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి ఈ అమ్మడికి. అయితే సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తూ మంచి విజయాలను అందుకుంది  ఈ భామ . ఉయ్యాల జంపాల సక్సెస్ తర్వాత చేసిన 'సినిమా చూపిస్త మామ' కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హీరో నిఖిల్ తో జంటగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది అవికాగోర్.

 

 

 

 

 సినిమాల్లో  అందం అభినయంతో చూడముచ్చటగా కనిపించే ఈ అమ్మడు... ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఎప్పుడు ముద్దుగా బొద్దుగా కనిపించే అవికాగోర్... తాజాగా దయ్యం అవతారం ఎత్తింది. సినిమాలకి  కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు...  తాజాగా రాజు గారి గది 3 సినిమా చేసింది. అయితే ఇప్పటికే విడుదలైన రాజుగారిగది 1,  2 లు మంచి విజయాన్ని అందుకున్నాయి. కాగా ఓంకార్ దర్శకత్వం ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా గురించి తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అవికాగోర్ . 

 

 

 

 

 తాజాగా  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవికా గోర్  ఆ పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముందుగా తను  చేసిన పాత్రకి తమన్నాని అనుకున్నారని... కానీ తమన్నా డేట్స్ కుదరక పోవడం వలన... ఈ కథ తన దగ్గరికి వచ్చిందని అవికాగోర్ తెలిపింది. తన దగ్గర ఈ కథ వినిపిస్తుండగా చాలాసార్లు భయపడ్డానని ఆమె తెలిపింది. అంతేకాకుండా సినిమా చూసే వాళ్ళుకు  కూడా అదే ఫీల్ కలుగుతుంది అని చెప్పేది. అయితే ఈ కథకి నో చెప్పడానికి గల కారణం  కనిపించలేదని కొత్త పాత్రలు చేయాలని ఉద్దేశంతోనే ఈ కథకు ఓకే చెప్పానని ఆమె తెలిపింది. ఈ సినిమాలో తను చేసిన పాత్ర తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని అవికా గోర్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: