మొన్న ఆ మధ్య ఈ యంగ్  హ్యాండ్సమ్ హీరోపై,టాలీవుడ్‌లో ఓ రూమర్  హాట్ టాపిక్ గా  మారింది.మాములుగా అయితే  తాను ఈ రూమర్స్ ని పెద్దగా  పట్టించుకొను అని,కానీ  ఇంతలా దారుణమయిన  రూమర్  తన మీద రావటంతో,డైరెక్ట్ గా  నవదీప్ రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇవాల్సివచ్చింది అని చెప్పారు. ఇంతకీ  ఈ రూమర్ ఏమీటంటే,నవదీప్.. అమ్మాయిలకంటే అబ్బాయిలకు ఎక్కువ ఎట్రాక్ట్ అవుతారు అని,అతను కొంచెం తేడా అని  "గే" అని  పుకార్లు బాగా వచ్చాయి.

ఇటీవల నవదీప్ ఈ రూమర్స్ పై  స్పందిస్తూ  ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. హీరో నవదీప్ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది చక్కనైన ఒడ్డు పొడుగు,మరియు ఆకర్షించే ఆయన పిల్లి కళ్ళు. హీరోకి ఉండాల్సిన  ముఖ్యమయిన లక్షణాలన్నీ ఇతనిలో ఉనాయి .  అపుడెపుడో 2004లో జై సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి,సుమారు నలభై సినిమాల్లో హీరోగానే కాకుండా,హీరో స్నేహితుడి  పాత్రలు కూడా చేసేవాడు.అయితే నవదీప్ కెరియర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం  అంటే ‘చందమామ’ అని చెప్పచు.

ఈ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ అది మల్టీస్టారర్ కాబట్టి అంత పేరు రాలేదు. ఈ మధ్య కండలు కూడా బాగా పెంచి,సిక్స్ ప్యాక్ చేసారు అని ఆయన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోస్ ద్వారా తెలుస్తుంది.ప్రస్తుతం నవదీప్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో  ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు అని సమాచారం. అసలు ఈ పుకార్లు ఎలా వచ్చాయి అని నవదీప్ ని అడగగా,నేను యూఎస్‌లో ఉన్నపుడు ఒకరు నాతో చాట్ చేసారు.మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు,మిమ్మల్ని ఒక ప్రశ్న  అడుగుతా అన్నాడు.

సరే అడగమంటే  మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేనూ అంతేనండి అని అన్నాడు,మీతో  చాలా మాట్లాడాలి ,నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉంది అని అన్నారు, దానికి నేను వెంటనే నాకు ఇంటరెస్ట్ లేదు అని  బై చెప్పి ఒక్క  దండంపెట్టేశా. అసలు గేలు  సినిమాల్లో  చూపించినట్లు ఉండరు కేవలం హాస్యం కోసమే సినిమాలో ఆవిధంగా చూపిస్తారు అని మీడియాతో ముచ్చటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: