టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘జై’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నవదీప్ పెద్దగా సక్సెస్ హీరోగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ సినిమాలో హీరో అల్లు అర్జున్ కి ఫ్రెండ్ గా నటించి కన్నింగ్ క్యారెక్టర్ చేసి తెలుగు సినిమా ప్రేక్షకులను బాగా అలరించాడు. ఆ తర్వాత హీరోయిన్ సపోర్టుగా క్యారెక్టర్లు చేస్తూ కెరీర్ని రాణిస్తున్న నవదీప్ బిగ్ బాస్ సీజన్ 1 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. బాగా పాపులర్ అయ్యాడు. ఇటువంటి నేపథ్యంలో నవదీప్ ఇండస్ట్రీలోకి వచ్చి 40 చిత్రాలకు పైగా నటించడం జరిగింది. దీంతో ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మరియు జర్నీ గురించి అనేక సంచలన కరమైన విషయాలు చెప్పుకొచ్చారు.


ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో తనని అందరూ గే అని అనుకున్నారని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో చాలామంది ఇదే వైఖరి తనపై కలిగి ఉండేవారు అంటూ ఇంటర్వ్యూలో తెలిపాడు. అంతేకాకుండా తను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బాగా డబ్బున్న వాడిననే ప్రచారం జరిగిందని.. వీడికి బాగా పొగరెక్కువ అనుకునేవారని చెప్పుకొచ్చాడు.  గే అనే రూమర్ క్రియేట్ అయినా స్టార్టింగ్ లో...ఒకసారి 'మీకు అబ్బాయిలంటే ఇష్టమట కదా..' అని అడిగాడని.. వాడికి ఏం చెప్పాలో అర్ధం కాలేదని నవదీప్ అన్నారు.


కాదు అని చెప్పినా వాడు నమ్మడని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడని అప్పటి సంఘటన గుర్తు చేసుకున్నాడు. అలానే తను అమెరికా ఉండగా ఓ వ్యక్తి చాట్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి గురించి నవదీప్ మాట్లాడుతూ..''యూఎస్ లో ఉన్నప్పుడు ఒకరు నాతో చాట్ చేశారు. నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని ఒకటి అడుగుతా అన్నాడు. వీడేం అడుగుతాడురా బాబు అని.. సరే చెప్పు అని అన్నాను. ఏం లేదు నాకు ఆ నిజం తెలుసు.. మీరు ఒప్పుకోరని కూడా తెలుసు.. అని చెప్పి మీకు అబ్బాయిలంటే బాగా ఇష్టం అంట కదా.. నేను అంతేనండి అని'' వెంటనే తన పరిస్థితిని చెప్పుకుంటూ వాడి దండం పెట్టేసినట్లు నవదీప్ చెప్పుకొచ్చాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: