మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటించిన 151 వ చిత్రం  'సైరా' భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ బహుభాషా చిత్రం ప్యాన్ ఇండియా ఫిలింగా ఇతర భాషల్లో కూడా విడుదలైంది.  మేగా స్టార్ & మెగా పవర్ స్టార్ అలోచనలే కాదు అభిమానుల ఉహల ప్రకారం ఈ సినిమాకు అనుకున్నంత విజయం దక్కలేదు.తొలిరోజు ఓపెనింగ్స్ మురిపించి రెండోరోజునుంచి కలెక్షన్లలో భారీ డౌన్-ఫాల్ కనిపించింది. కానీ దసరాపండుగ సెలవులవేళ కొంచేంపుంజుకుంది. 

 

అయితే ఆ తరవాత మళ్ళీ కలక్షన్ డ్రాప్స్ తప్పలేదు. తెలుగు వెర్షన్ పెర్ఫార్మన్స్ సూపర్ అయినా, టాలీవుడ్ హీరోగా మరోసారి మెగాస్టార్ ప్రూవ్ చేసుకున్నా,  తమిళ్ - మళయాళ – వెర్షన్లు డిజాస్టర్లుగా షాకిచ్చాయి. కన్నడం మాత్రం బెటర్.  – హింది వర్షన్ ధారుణ డిజాస్టరై నిరాశ పరచగా – చిరంజీవి మాత్రం 'పాన్ ఇండియా స్టార్' కాలేక పోయారు. 

 

అయితే తెలుగు వెర్షన్ కలెక్షన్స్ లో కూడా ఇప్పుడు డ్రాస్టిక్ డ్రాప్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మీడియాలో ప్రచారంవుతున్న కలెక్షన్స్ దాదాపుగా “ఫేక్” అని యాంటి ఫ్యాన్స్ అంటున్నారు — ఆరోపించే మరో విషయం ఏంటంటే 'సైరా' కలెక్షన్స్ ను ఒక దశ దాటి  ఎక్కువగా చూపించలేక పోవడంతో ఏకంగా “ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగర్స్” ను మాయ చేసి  తగ్గిస్తున్నారట!

 

సినిమా విడుదల సమయంలో బడ్జెట్ రెండు వందల ఏభై కోట్లని, మూడు వందల కోట్లని రకరకాలుగా చెపుతూ వస్తున్నారు. దాంతో థియేట్రికల్ బిజినెస్ ₹ 200 కోట్లకు పైమాటేనని వార్తలు వచ్చాయి.  కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా “వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ మార్క్” నాలుగు కోట్లు అటూ ఇటుగా ₹ 150 కోట్ల షేర్ అంటున్నారు. అందులో ₹ 130 కోట్ల షేర్ వచ్చేసిందని ఇక జస్ట్ ఇరవై కోట్ల షేర్ తెస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని అంటున్నారు 

 

ఈ గణాంకాల మాయాజాలం మతలబును కాస్త మైండ్ ఉపయోగించి గమనించి చూస్తే అర్థం అవుతుందనేది వారి వాదన.  జనాలు నమ్ముతారో లేదో తెలియదు కానీ బ్రేక్ ఈవెన్ ఫిగర్ నే తగ్గించడం మాత్రం “మైండ్ బ్లోయింగ్ టెక్నిక్  అని వెటకారంగా మెచ్చుకుంటున్నారు. 

 

అయినా ఈ బాక్స్ ఆఫీసు కలెక్షన్లే కాదు-బ్రేక్ ఈవెన్ ఫిగర్లనే — తగ్గించారా? దీనికి బదులు  ఇంకొంతకాలం ఆగితే సినిమా బడ్జెట్ లోనే బొక్కుందని అంటారేమో? దాన్ని తగ్గిస్తే సినిమా బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు – లాభాలే వస్తాయి! ఈ లెక్కలు మేథావులకు కూడా అర్థం అయ్యేలాలేవు! అయినా మెగా బ్రెయిన్స్ కదా!  కుహనా మేధావులకు మాత్రమే అర్ధమౌతుందేమో?  

 


మరింత సమాచారం తెలుసుకోండి: