ఈ సారైనా.. మెగా బ్రదర్ నాగబాబు తీరని కోరిక నెరవేరువేరుతుందో లేదో చూడాలి మరి. అన్నయ్య చిరంజీవి ఆ కోరిక నెరవేరుస్తాడో.. లేదో చూడాలి మరి. ఇక అసలు విషయానికి వస్తే .. కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఆశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని దగ్గించుకున్నాడు చిరంజీవి. 41 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో చిరంజీవి మొదటి సారి చారిత్రక పాత్రైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  క్యారెక్టర్‌ను  ‘సైరా నరసింహారెడ్డి’  సినిమాలో పోషించడం జరిగింది.


 ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సొంతం చేసుకుంది. చిరంజీవి ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఎన్నో తన నటన ద్వారా సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు దగ్గించుకోలేక పోయాడు.


ఇటీవల విడుదలైన  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో ఐనా  చిరంజీవి చారిత్రక పాత్ర పోషించలేదన్న లోటు తీర్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతోనైనా..చిరంజీవి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని  నాగబాబు చాలా సందర్భంలో తన కోరికను బయట పెట్టడం జరిగింది.  మరి మరి నాగబాబు చెప్పినట్టే ‘సైరా ...నరసింహారెడ్డి’ చిత్రంతో చిరంజీవి నిజంగానే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకొని నాగబాబు చిరకాల కోరిక తీరుస్తాడా లేదా అనేది చూడాలి.


 నాగబాబు చిరకాల కోరిక నెరవేరితే మాత్రం అందానికి హద్దులు ఉండవు. చిరు కూడా బాగా నటించాడు అని తెలుస్తుంది అందరికి. ఈ అవార్డు వస్తే మాత్రం చిరుకి ఒక మంచి గుర్తింపు లభించింది అనే చెప్పాలి. అవార్డు దగ్గించికొని నాగబాబు కోరిక నెరవేరాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: