కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన సినిమా బిగిల్ దీపావళి కానుకగా అక్టోబర్ 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. 180 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, అట్లీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపించనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్లు సినిమాకు హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. 


రు. 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్లోనే ఎక్కువ ఖర్చుతో తెరకెక్కిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రు. 222 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ అటు ఫుట్ బాల్ కోచ్ గా ఇటు సామాన్య వ్యక్తిగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక కోలీవుడ్ లో సెన్సార్ పూర్తయిన ఈ సినిమా రన్ టైం 179 నిమిషాలుగా చేశారు. అంటే ఒక నిమిషం తక్కువగా మూడు గంటల పాటు ఈ సినిమా ఉండనుంది. 


అయితే ఇంత సమయం పాటు థియేటర్లో కూర్చుని సినిమా చూడాలంటే ప్రేక్షకులకు కష్టమే. తమిళంలో విజయ్ స్టార్ హీరో కాబట్టి ప్రేక్షకులు కొంత వరకు ఓపిక పడతారు. అదే తెలుగులో విజయ్ సినిమా మూడు గంటలు చూడటం అంటే ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష లాంటిది. సినిమా కథలో దమ్ము ఉంటే ప్రేక్షకులు అంత ఓపికగా థియేటర్లో కూర్చుని సినిమా చూడలేరు. 


ఎందుకంటే గత కొన్ని రోజులుగా స్టార్ల సినిమాలు తెలుగులో వరుసగా అవుతున్నాయి. విజయ మార్కెట్ కూడా తెలుగులో పూర్తిగా పడిపోయింది. మరి విజయ్ మూడు గంటలసేపు తెలుగు ప్రేక్షకులను కూడా మెస్మరైజ్ చేస్తాడా స్క్రీన్ ప్లే ఎంతలా మ్యాజిక్ చేస్తుంది అన్నది సినిమా రిలీజయ్యాక తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: