బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మూవీ RRR. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఎప్పుడు తన సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉండే జక్కన్న RRR  కు అది కుదరట్లేదట. 

 

సినిమా మొదటి నుండి అనుకున్న విధంగా షెడ్యూల్ జరగట్లేదు. ముందు చరణ్ కు ఆ తర్వాత తారక్ కు వరుసగా గాయాలు అవడంతో సినిమా షూటింగ్ వాయిదా పడ్డది. ఎలాగోలా ఇప్పటి వరకు 3 షెడ్యూల్ లను పూర్తి చేసుకున్న RRR మూవీ త్వరలోనే మరో భారీ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. 

 

ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సినిమాలకు ఎప్పుడు ఇలాంటి రూమర్స్ రాలేదు. జక్కన్న సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడంతో ఇప్పుడు ఈ షూటింగ్ వాయిదాల వల్ల అనుకున్న టైంకు రిలీజ్ కూడా కష్టమని అంటున్నారు. అయితే ఎన్ని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం వాటికి స్పందించడం లేదు. 

 

అనుకున్న టైం కు రిలీజ్ చేసే ఆలోచన ఉంటే ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసి ఉండాల్సింది. కాని అది కూడా జరుగలేదు.  అందుకే RRR కచ్చితంగా వాయిదా పడే ఛాన్స్ లే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: