ఫీ మేల్ యాక్ట్రెస్ చాలా మందికి బ్యూటి ఫుల్ అని, హాట్ హీరోయిన్ అని, గ్లామరస్ డాల్..ఇలా రక రకాలుగా పిలుస్తుంటారు. కాని చాలా తక్కువమందికే మహానటి..వంటి బిరుదు లభిస్తుంది. అలానే ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా.. లేడీ అమితాబ్ గా గుర్తింపు దక్కించుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా సినిమాలు చేసేవారు. స్టార్ హీరోలతో విజయశాంతి చేసిన సినిమాలు మాత్రమే కాకుండా.. ఈమె చేసిన హీరోయిన్ ప్రధానమైన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. 13 ఏళ్ల క్రితం విజయశాంతి సినిమాలకు దూరం అయ్యారు. అప్పటి నుండి పూర్తిగా రాజకీయాల్లోనే ఉన్నారు. పార్లమెంటు సభ్యురాలిగా ఇంకా పలు పార్టీ పదవులను నిర్వహించిన విజయశాంతి మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

విజయశాంతి తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో పరుచూరి గోపాలకృష్ణ కొన్ని సీన్స్ రాశారు. ఇటీవలే ఆ సీన్స్ కు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన విజయశాంతితో ఉన్న అనుబంధం గురించి.. ఆమె సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న తీరు గురించి మాట్లాడారు. అంతేకాదు విజయశాంతి కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చాలా ఏళ్ళ తర్వాత ఇద్దరు కలిసి పనిచేస్తుండటం తో కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారట. 

1986 లో కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ-విజయశాంతి జంటగా తెరకెక్కిన అపూర్వ సహోదరులు సినిమా షూటింగ్ సమయంలో విజయశాంతి తల్లి చనిపోయారట. అయితే ఆ విషయం రాఘవేంద్ర రావు పరుచూరికి చెప్పి విజయశాంతి కి అసలు విషయం తెలియనీయకుండా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పి తీసుకు వెళ్లమన్నారట. ఆ వెంటనే పరుచూరి..  ఆయన భార్య కలిసి విజయశాంతిని కారులో ఇంటికి తీసుకు వెళ్లారట. ఇంటికి చేరుకున్న తర్వాత విజయశాంతికి విషయం అర్థమవడంతో బోరుమని ఏడ్చేసిందట. తల్లి పై పడి చిన్న పిల్లలా విజయశాంతి ఏడవడం అందరిని కలచివేసిందట. ఆ సమయంలో ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదని పరుచూరి తెలిపారు. సాధారణంగా కొన్ని సినిమాలలో తండ్రి, లేదా తల్లి పాత్ర చనిపోయినప్పుడు ఏడ్చే సన్నివేశాలలోనే పాత్రలో లీనమయిపోయి ఎంతో ఎమోషనల్ అయిపోతారు. అలాంటిది నిజంగా కన్న తల్లి వదిలి వెళ్ళిపోయిందంటే ఆ సమయంలో ఓదార్చడం ఎవరి తరమూ కాదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: