సమాజంలో సమస్యలు తీసుకొని.. కథలు రాసుకునే కొరటాల శివ ఈ సారి దేవుణ్ణి టచ్ చేస్తున్నాడు. చిరంజీవి తీసే సినిమా కోసం ఏకంగా గుడి సెట్ నే వేయిస్తున్నాడు. సమాజంలోని చెడును చూపుతూ  పరిష్కారం చూసే కొరటాల శివ దేవాలయాల్లో జరిగే అవినీతిని బయటపెట్టే అవకాశం ఉంది. 


ఏడాది నుంచి ఊరిస్తున్న చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ దసరా రోజు లాంఛనంగా మొదలైంది. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మిర్చిలో ఫ్యాక్షనిజం.. శ్రీమంతుడులో దత్తత.. జనతాగ్యారేజ్ లో పర్యావరణం.. భరత్ అనే నేనులో సంస్కరణలను ఫోకస్ పెట్టి సక్సెస్ అయిన కొరటాల.. ఎండోమెంట్ ను సంస్కరించే పని స్టార్ట్ చేశాడు. 


మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు కొరటాల శివ తీసిన ప్రతి సినిమాకు దేవీశ్రీ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే.. చిరంజీవి మూవీకి దేవీశ్రీ మ్యూజిక్ ఇస్తాడో లేదో తెలియాల్సి ఉంది. సినిమా మొదలైన రోజు మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎనౌన్స్ చేయలేదు. చూస్తుంటే.. కొరటాలకు తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ ను కాదని.. ఫస్ట్ టైం మరొకరితో వర్క్ చేయాల్సి వస్తోంది. 


సినిమాను సమ్మర్ కు రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు నిర్మాతలు. ఖైదీ నంబర్ 150.. సైరా తర్వాత రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సైరా దసరాను టార్గెట్ చేయగా.. కొరటాల మూవీతో సమ్మర్ ను లక్ష్యంగా చేసుకొని.. హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు ఈ మెగా ప్రొడ్యూసర్. మొత్తానికి కొరటాల శివ వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ లతో సమాజానికి ఉపయోగపడేలా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. సైరా తర్వాత చిరంజీవి మూవీ ఏంటి అనేదానిపై సస్పెన్స్ కొంత వీడిందనే చెప్పాలి. చారిత్రక నేపథ్యమున్న సైరా మూవీతో ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందిన చిరంజీవి.. కొరటాల దర్శకత్వంలో వచ్చే సినిమాలో ఎలా మెప్పిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఠాగూర్ సినిమాలో లంచగొండితనంపై ఓ రేంజ్ లో నటించిన చిరంజీవి ఇపుడు మరోసారి సమాజానికి ఉపయోగపడే సినిమాతో వస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: