మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చాణక్య’. మెహ్రీన్ హీరోయిన్. తిరు దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండో-పాక్ నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చిత్ర దర్శక, నిర్మాతలకు సెన్సార్ సభ్యులు చెప్పారట. సినిమా హిట్టు అవుతుందని భరోసా ఇచ్చారట. చాలా కాలంగా హిట్టు కోసం పరితపిస్తోన్న గోపీచంద్‌కు ‘చాణక్య’ ఊరటనివ్వడం ఖాయమని అంటున్నారు..


చిత్ర నిర్మాత కూడా ఇదే ధీమాతో ఉన్నారట. అందుకే, ‘సైరా’ లాంటి పెద్ద సినిమా ఉన్నా అక్టోబర్ 5న విడుదల చేసే ధైర్యం చేస్తున్నారు. నిజానికి సెన్సార్ టాక్‌పై అనిల్ సుంకర ఒక ట్వీట్ చేశారు. సెన్సార్ బోర్డు సభ్యులంతా ‘చాణక్య’ను మెచ్చుకున్నారని, ముఖ్యంగా డైలాగులు చాలా బాగున్నాయని ప్రశంసించారని అనిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


అయితే ,ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే....
పది నిమిషాలు ఆలస్యంగా సినిమా  ప్రదర్శించినందుకు సినిమా థియేటర్‌పై పోలీసులు కేసు న‌మోదు చేసారు. వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. అదెక్క‌డో కాదు మ‌న హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. వివ‌రాల‌లోకి వెళితే  హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో ఉన్న మంజీరా సినీ పోలిస్ థియేటర్లో గోపీచంద్ నటించిన చాణక్య చిత్రం 04.40 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా థియేటర్ యాజమాన్యం పది నిమిషాలు ఆలస్యంగా చిత్రాన్ని ప్రదర్శించింది. 


పది నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడంతో ప్రేక్షకుల విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేశారని నిబంధనలను సైతం ఉల్లంఘించారని ఆరోపిస్తూ కూక‌ట్ ప‌ల్లి పోఈసుల‌కు ఫిర్యాదు చేసాడు.  ఈ నెల 8న పోలీసులకు  పిర్యాదు అందగా  అందుకు సంబంధించి న్యాయ‌స‌ల‌హా తీసుకుని, కోర్టు నుంచి అనుమతి పొందిన  కేపీహెచ్‌బీ పోలీసులు  ధియేట‌ర్ యాజ‌మాన్యంపై కేసు నమోదు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: