అందాల ముద్దుగుమ్మ కాజల్... సుదీర్ఘ కాలంగా తెలుగు తమిళ భాషల్లో అగ్రకథానాయికగా వెలిగిపోతున్న హీరోయిన్. మామూలుగా అయితే హీరోయిన్ లు  అందరికీ కొంతకాలంపాటు హవా నడుస్తుంది. ఇక ఆ తర్వాత కొత్త కొత్త హీరోయిన్లు వచ్చేసరికి వీళ్ల క్రేజ్ కాస్త తగ్గిపోతుంది. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి. అయితే ఈ విషయంలో కాజల్ మాత్రం మినహాయింపు అనాలి. ఎందుకంటే ఎంతోమంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ... ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే  వెలుగుతుంది కాజల్ . ఓవైపు సీనియర్ హీరోల సరసన నటిస్తూ... మరోవైపు కుర్ర హీరోల తో రొమాన్స్ చేస్తుంది ఈ అమ్మడు. అయితే కాజల్ కి ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందం చందం కొంటెతనం కలగలిపిన ముద్దుగుమ్మ కాజల్. అయితే ఒక తెలుగు భాష లోనే కాదు అటు తమిళ భాషల్లో కూడా తన హవా నడుపిస్తుంది కాజల్ .


 తెలుగులో టాప్ హీరో చిరంజీవి సరసన చేసిన కాజల్ .... ఇండియన్ 2  సినిమాలో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. అయితే సీనియర్ హీరోలే  కాకుండా... కుర్ర హీరోల సరసన కూడా నటించి  మెప్పిస్తుంది. అయితే ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేసి  ఎన్నో విజయాలు తన ఖాతాలో  వేసుకుంది. అయితే ఇప్పటికే అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కాజల్ . కానీ ఆ ఒక్క హీరోతో మాత్రం ఎప్పుడెప్పుడు ఛాన్స్  వస్తుందా అని ఎదురు చూస్తుందట . ఇన్నేళ్ల  తన కెరీర్లో ఒక హీరో తన సినిమా చేయాలని తెగ ఫీలై పోతోంది కాజల్. 


 ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో  మాట్లాడిన కాజల్  కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపింది . తమిళంలో అజిత్ విజయ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశానని ... ఇక ఎవర్గ్రీన్ హీరో కమల్ హాసన్ సార్ తో కూడా ఇండియన్ 2 లవ్ చేస్తున్నాను అని చెప్పింది కాజల్ . అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడిగా నటించేందుకు మాత్రం ఛాన్స్ రాలేదని... ఆ వెళితి  ఒక్కటే ఉండిపోయిందని కాజల్  తెలిపింది.త్వరలో   రజనీ సరసన చాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.మరి  సూపర్ స్టార్  రజనీకాంత్ సరసన నటించే అవకాశం కాజల్ కి ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: