శ్రీముఖి అందం కోసమే బిగ్ బాస్ చూస్తున్న బ్యాచ్ లేకపోనులేరు. ఈమె బిగ్‌బాస్‌ షోలో అందంతో అదరగొడుతూ.. అల్లరితో అలరిస్తు.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకొని టాప్‌ 3లో ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక ఈవారం నామినేషన్‌లో ఉన్న ఇంటి సభ్యుల కోసం ఎవరి అభిమానులు వారి ఇష్టుల కోసం గట్టిగానే పబ్లిసిటీ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎలా అయినా తన్నుకుపోవాలని ప్రయత్నిస్తున్న శ్రీముఖికి మద్దతిస్తు వినూత్న క్యాంపెయిన్‌ జరుగుతోంది. ఓట్‌ ఫర్‌ శ్రీముఖి అంటూ సినిమా థియేటర్లలో ఎక్కడ చూసినా ఈమె పోస్టర్లే.

ఒకప్పటి కౌషల్ లా ఇప్పుడు శ్రీముఖి సైతం తనకు ప్రచారం కల్పించడానికి కొందరిని ఏర్పాటు చేసిందనే ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పెయిడ్‌ బ్యాచ్‌ మాత్రం ఇక రాత్రింబవళ్లు కష్టపడుతూ పోస్టర్లు, యాడ్స్‌ అంటూ ఏ ఒక్కటినీ వదలకుండా ఆమెను సేవ్‌ చేయండంటూ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఈ పెయిడ్‌ బ్యాచ్‌ సాయంతో నకిలీ ఓట్లు సంపాదించి టైటిల్‌ విన్నర్‌గా నిలవాలని శ్రీముఖి చూస్తోందని ఆరోపించారు. ఆమెకోసం ఎంత ఖర్చు పెట్టినా వృథాయే అని ప్రచారాన్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్నారు కొంతమంది యాంటీఫ్యాన్స్‌. ఇలాంటి యాడ్స్‌ వల్ల ఉన్న ఓట్లు కూడా పోతాయని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా ఎవరేం చేసినా టైటిల్‌ సాధించే అర్హత ఒక్క శ్రీముఖికే ఉందని ఆమె ఫాన్స్ అభిప్రాయం. ఒకరి ప్రచారశైలిని తప్పుపట్టే అర్హత ఎవరికీ లేదంటూ శ్రీముఖి అభిమానులు వారికి గట్టి కౌంటర్లనే ఇస్తున్నారు. కొందరు మాత్రం బిగ్‌బాస్‌ సీజన్‌ 2 లో కౌశల్‌ ఆర్మీ లా గుడ్డిగా ఫాలో అయితే మొదటికే మోసం వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా అటు ప్రచారంతో ఇటు ట్రోలింగ్‌తో జనాల మనసుల్లో నిలుస్తూ భిన్న అభిప్రాయాలను సైతం తనకు తగ్గట్టు మలచుకొని టైటిల్ విజేతగా నిలిచే అవకాశం గట్టిగానే ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: