కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో వచ్చిన "భారతీయుడు" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించి అందరినీ అలరించాడు. అయితే ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది. 23 ఏళ్ల క్రితం వచ్చి సంచలనం క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్  గా వస్తున్న "ఇండియన్ 2"కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.


గత కొన్ని రోజులుగా బడ్జెట్ కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయి, మళ్ళీ బడ్జెట్ సమీకరణలు కుదిరి షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో కూడా కమల్ యంగ్, ఓల్డ్ పాత్రల్లో కనిపించనున్నారు. వీటిలో ఓల్డ్ పాత్ర 90 ఏళ్ల వృద్దిడిది అని తెలుస్తోంది. ఈ పాత్రకి కూడా సినిమాలో ఫైట్స్ ఉండబోతున్నాయట. ఈ పాత్ర గురించి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ మాట్లాడుతూ 90 ఏళ్ల వృద్దుడి పాత్రకు ఫైట్స్ కంపోజ్ చేయడం చాలా ఛాలెంజింగా ఉంది.


ఏజ్ ఫ్యాక్టర్ వలన బాడీ మూమెంట్స్ డిజైన్ చేయడం కష్టంతో కూడుకున్న పని అని అన్నారు. అంతేకాదు కమల్ హాసన్ ఆ వృద్దుడి పాత్రలో ఒదిగిపోయారని, బాడీ మూమెంట్స్, మేనరిజమ్ అన్నీ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నారని చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ చుసుకుని ఫైట్ చేయాలి కాబట్టి జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. మరి ౯౦ ఏళ్ళ వృద్ధుడిగా కమల్ చేసిన ఫైట్స్ ఏ విధంగా ఉంటాయో తెర మీద చూడాల్సిందే.


ఇండియన్ 2 చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ  లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్, ఐశ్వర్య రాజేశ్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు 2’ పేరుతో విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: