ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు..ఈ జీవితానికి ఇంకేమీ వొద్దు అనుకునే వారు కోకొల్లలు.  కాకపోతే అదృష్టం కలిసి రాక కొంతమంది..టాలెంట్ ఉన్నా అది చూపించుకునే అవకాశం లభించకపోవడం ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పటికీ స్టూడియోల వెంట తిరుగుతూనే ఉన్నారు. ఇరవై ఏళ్ల క్రితం తన మిమిక్రితో అందరినీ ఆకర్షించి..సినిమాల్లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అనుకున్న వ్యక్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. 

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా..V6 ఛానల్ లో బిత్తిరి సత్తిగా న్యూస్ చెబుతు వెరైటీ లుక్ తో చేతి వేళ్లను మల్చుకొని అందరినీ ఆకర్షించాడు బిత్తిరి సత్తి అలియాస్ కావలి రవి.  చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ..కొన్ని ఛానల్స్ లో యాంకర్ గా చేసినా గుర్తింపు రాలేదు..ఎప్పుడైతే V6 ఛానల్ లో బిత్తిరి సత్తిగా తనదైన కామెడీ ముద్ర వేశాడో అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి.  ఆయన సినిమాల్లోనూ అడపా దడపా వేషాలు వేస్తూ వస్తున్నాడు.  ప్రస్తుతం TV9  లో కొనసాగుతున్న బిత్తిరి సత్తి హీరోగా  ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.

 బిత్తిరి సత్తి హీరోగా ప్రభాకర్ దర్శకత్వంలో 'తుపాకి రాముడు' రూపొందింది. రసమయి బాలకిషన్ ఈ మూవీ నిర్మిస్తున్నారు.  ‘తుపాకి రాముడు’ మూవీ  నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈలోగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ సినిమా బిత్తిరి సత్తి కెరీర్ ని ఏ మలుపు తిప్పబోతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: