టాలీవుడ్ కి దూరంగా దాదాపు పదేళ్లు ఉన్న మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్  150’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మించిన ఈ మూవీ తమిళంలో విజయ్ నటించిన ‘కత్తి’.  తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వినాయక్ ఎంతో అద్భుతంగా తీశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయంతో దుమ్మురేపారు.  ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  తర్వాత స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించాడు. 

తాజాగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి.  ‘మిర్చి’ మూవీ తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న కొరటాల శివ చివరిగా మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ మూవీకి దర్ధకత్వం వహించారు.  కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్ లో ఈ మూవీ సందేశాత్మకంగా రూపొందబోతుందట. ఇప్పటి వరకు కొరటాల తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక అద్భుతమైన సందేశం ఉంటుందన్న విషయం తెలిసిందే.

ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మూవీకి అదిరిపోయే టైటిల్ సెలక్ట్ చేసినట్లు సమాచారం.  కథ పరంగా ఈ మూవీకి 'గోవింద ఆచార్య' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ టైటిల్ గా దీనినే కొనసాగిస్తారు.  ఒకవేళ సినిమా పూర్తయ్యేనాటికి టైటిల్ పై చిత్ర యూనిట్ మొత్తం ఏకాభిప్రాయానికి వస్తే అధికారికంగా ప్రకటిస్తారు. 'గోవింద ఆచార్య' అనే టైటిల్ చాలా బావుందంటూ అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: