ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోని యంగ్ హీరోలంతా స్టంట్లు స్వయంగానే చేస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. దాని కోసం శిక్షణలు కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుత ఇండస్ట్రీలో. వీటితో పాటు హీరోలు గుర్రపు స్వారీ కూడా చేయవలసిన అవసరం వస్తుంది. ఇక ‘మగధీర’, ‘బాహుబలి’ సినిమాలు చుస్తే మనం కూడా గుర్రపు స్వారీ చేస్తే బాగుంటుందే అనే భావన సీనియర్ హీరోల్లో కలిగింది అంటే నమ్మండి. ఇప్పుడు ఆ వరుసలో విక్టరీ వెంకటేష్ ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


‘పెళ్ళి చూపులు’ ఫేమ్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్  సినిమా తీస్తున్నారు అన్న విషయం అందరికి  తెలిసిందే. ఈ చిత్రంలో వెంకటేష్ హార్స్ రైడర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం కోసం వెంకీ హార్స్ రైడింగ్ శిక్షణ కూడా తీసుకుంటున్నారు అని సమాచారం. ఐతే ఈ విషయంలో మాత్రం వెంకీ రిస్క్ చేస్తున్నారని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అందరు వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవల వెంకీ  మోకాలి గాయంతో కొద్దీ రోజులుగా బాధపడుతున్నారు. కాబట్టి, ఆయనకు హార్స్ రైడింగ్ మంచిది కాదు అని వాళ్ళ భావన. ఇలా తన గాయాన్ని పక్కకి పెట్టి వెంకీ  గుర్రాలపై నుంచి స్టంట్స్ చేస్తే మళ్లీ గాయం తిరగబడే ప్రమాదం ఉందని అంటున్నారు  ప్రముఖులు. నిజానికి ‘వెంకీ మామ’సినిమాలోనూ కొన్ని హార్స్ రైడింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అట. వెంకీ మామ షూటింగ్ సమయంలో  వెంకీ కాలికి  గాయం కావడం జరిగింది.

ఇలా జరగడంతో వెంకీ శ్రేయోభిలాసులు అలాంటి స్టంట్లు చేయకండి అని కోరుతున్నారనట. ఐనా కానీ వెంకీ మాత్రం  హార్స్ రైడింగ్ చేయడానికి  ఎక్కువగా ఆసక్తి  చూపించడం గమనార్థకం. వెంకీ ఇలా సొంతంగా రిస్క్ చేయాల్సిన అవసరం లేకుండా వీఎఫ్ఎక్స్ సహాయం తీసుకుంటే  బాగుండుతుంది అని అందరి ఆలోచన.



మరింత సమాచారం తెలుసుకోండి: