కథలను ఎంచుకోవడంలో ధనుష్ వైవిధ్యాన్ని కనబరుస్తున్నాడు.  ఒక్కో సినిమాను ఒక్కో రకమైన కథను ఎంచుకొని అందులో వైవిధ్యంగా ఉండే విధంగా చూసుకుంటున్నాడు.  అలా ఇప్పటికి ఎన్నో సినిమాలు చేశాడు.  ప్రతి సినిమా చాలా కొత్తగా అనిపిస్తుంది.  వడ చెన్నై సినిమా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఇప్పుడు తాజాగా వెట్రిమారన్ దర్శకత్వం వహించిన అసురన్ సినిమా కూడా అదే విధంగా ఉన్నది.  


ఈ సినిమాలో కులవివక్ష, భూవివాదాలు చుట్టూ సినిమా నడుస్తుంది.  రియాలిటీకి దగ్గరగా కథ ఉంటుంది.  ధనుష్ కూడా నటించినట్టు కాకుండా కథలో లీనమై నటించాడు.  సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా ఉందని కీర్తిస్తున్నారు.  సినిమా అంటే ఇలా ఉండాలి అని పొగుడుతున్నారు.  అయితే, ఇలాంటి సినిమాలు మన దగ్గర ఎందుకు తీయడం లేదు.  


మన దగ్గర వస్తున్న సినిమాలు అన్ని దాదాపుగా కమర్షియల్ ఫార్మాట్ లో తీయడానికి ఆసక్తి చూపుతున్నారు.  లేదంటే సినిమాను లవ్ స్టోరీగా తీర్చి దిద్ది దానికి నాలుగు మసాలా డైలాగును, రెండు ఐటెం సాంగ్స్ జోడించి సినిమా తీస్తున్నారు.  ఇలా సినిమా తీయడం వలన డబ్బులు వస్తాయి.  కమర్షియల్ గా సినిమా హిట్ అవుతుంది.  సినిమాను ఇదే ఫార్మాట్లో తీస్తున్నారు కాబట్టి ఇక్కడ హిట్ శాతం తగ్గిపోతున్నది.  


కానీ, తమిళంలో మాత్రం అలా కాదు.  మంచి కథలను ఎంచుకొని, దానికి తగినట్టుగా పాత్రలను సృష్టించి సినిమా తీస్తున్నారు.  సినిమా కథ బాగుంది అంటే తప్పకుండా చూస్తారు.  దానికి ఓ ఉదాహరణ వడ చెన్నై, ఇప్పుడు అసురన్ సినిమాలు.  అసురన్ సినిమాలను అక్కడి రాజకీయ నాయకులు సైతం చూసి మెచ్చుకుంటున్నారు.  సినిమా బాగుందని ట్వీట్ చేస్తున్నారు.  రీసెంట్ గా ఈ జాబితాలో స్టాలిన్ కూడా చేరిపోయారు.  ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: