కృష్ణవంశీ హిట్ సినిమా తీసి చాలా కాలమే అవుతుంది. చాలా కాలంగా ఈ దర్శకుడి నుంచి కనీసం యావరేజ్‌ రేంజ్‌ సినిమా కూడా రాలేదు. దీంతో కెరీర్‌ పరంగానూ లాంగ్ గ్యాప్ వచ్చింది.2017లో రిలీజ్‌ అయిన సందీప్‌ కిషన్‌, సాయి ధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో నక్షత్రం సినిమా తరువాత కృష్ణవంశీ మరో సినిమాను ప్రకటించలేదు.చివరగా రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన గోవిందుడు అందరి వాడేలే సినిమాతో సక్సెస్‌ చూసిన కృష్ణవంశీ తరువాత మరో హిట్ చూడలేదు.తాజాగా ఈ సీనియర్‌ డైరెక్టర్‌ మరో సినిమాను ప్రకటించాడు. ప్రకాష్ రాజ్‌, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో ఓ క్లాసిక్‌ హిట్‌ను రీమేక్‌ చేస్తున్నట్టుగా ప్రకటించాడు.


అది మరాఠిలో ఘన విజయం సాధించిన నట సామ్రాట్‌ సినిమాను తెలుగులో రంగమార్తండ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ.అయితే నటసామ్రాట్‌ను రీమేక్‌ చేయటం కొందరు కరెక్ట్‌ కాదంటున్నారు. క్లాసిక్స్‌ను రీమేక్‌ చేయటం కన్నా అదే సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తేనే బెటర్‌ అన్న వాదన వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ ప్రధాన పాత్రలో.. నటుడు, దర్శకుడు మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను నానా పటేకర్‌, విశ్వాస్‌ జోషీలు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో పాటు 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.


ఇప్పుడు ఇదే సినిమాను ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రలో రంగమార్తండ పేరుతో రీమేక్‌ చేస్తున్నాడు కృష్ణవంశీ.కానీ కొంత మంది క్లాసిక్స్‌ను రీమేక్‌ చేయటం కన్నా అదే సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తేనే బెటర్‌ అన్న వాదన వినిపిస్తోంది. అంత ఇంటెన్స్‌ టేకింగ్‌, ఆ స్థాయిలో నటీనటుల నుంచి నటనను రాబట్టడం మళ్లీ మళ్లీ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎవరు ఎన్ని చేపిన బుధవారం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించిన కృష్ణవంశీ, టైటిల్‌ లోగోను కూడా రిలీజ్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: