మెగాస్టార్ చిరంజీవి సైరా విజయం సందడిలో ఉన్నారు. మొన్న ఏపీ సీఎంను కలిసి ఈ సినిమాను చూడాల్సిందిగా కోరాడు. నిన్న దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి ఢిల్లీలో సినిమా చూసారు. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా కోరారు చిరంజీవి. ఈ ఆనందంలో చిరంజీవి తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో మొదలుపెట్టారు.

 

 

ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా గోవింద  ఆచార్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసారని వార్తలు వచ్చాయి. ఇదే టైటిల్ అంటూ చిరంజీవి ఫోటో, అంజనా ప్రొడక్షన్స్ లోగోతో, దేవిశ్రీప్రసాద్ సంగీతం అంటూ పోస్టర్ కూడా నెట్లో సందడి చేస్తోంది. ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా కాకుండా ఆఫీషియల్ పోస్టర్ లా ఉండటంతో ఇది  అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. దీంతో కొణిదెల పీఆర్ఓ రంగంలోకి దిగింది. 'చిరంజీవి గారి 152వ సినిమాకు ఇంకా టైటిల్ ఏమీ నిర్ణయించలేదు. టైటిల్ ఫైనలైజ్ అయ్యాక అఫీషియల్ గా రిలీజ్ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చింది. దీంతో నెట్లో వైరల్ గా మారిన పోస్టర్ ఫేక్ అని తేలిపోయింది. ఇటీవల ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఎక్కువైపోతున్నాయి. దీంతో సినిమా యూనిట్ అఫీషియల్ గా చెప్తే కానీ నమ్మే పరిస్థితులు లేవు. సంగీత దర్శకుడి విషయంలో కూడా యూనిట్ ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

 

 

ప్రస్తుతం చిరంజీవి విజయానందంలో ఉన్నారు. తెలుగు, కన్నడలో మంచి రికార్డులు నెలకొల్పింది. ఖైదీ నెం.150 తాను నెలకొల్పిన నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ ను కొడుకు రంగస్థలంతో చేరిపేసాడు. తన కొడుకు నెలకొల్పిన ఆ రికార్డును తండ్రిగా సైరాతో చేరిపేసాడు. ఇది అభిమానులకు ఆనందం కలిగిస్తోంటే.. ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిరంజీవి 152వ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: