తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా 'సైరా'. చిరంజీవి హీరోగా , నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకు పోతుంది. చాలా బాగా కలెక్షన్స్ రాబడుతుంది. 


ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు. మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్‌లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది. బాహుబలిని మించిన రేంజులో ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయనడంలో సందేహం లేదు. 


ఈ సినిమాకు వంద కోట్లకు పైగా వసూల్ రాబట్టింది. ఈ సినిమా నైజాంలో మాత్రమే మంచి వసూల్ సాధించింది. అయితే, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో మాత్రం హిట్ అవ్వలేదని చెప్పాలి. అయితే గాంధీ జయంతి రోజు రిలీజ్ అయిన ఈ సినిమా 15 వ కలెక్షన్స్ విషయానికొస్తే ఇక్కడ తెలుగులో కూడా తగ్గిందనే చెప్పాలి. ఈరోజు కు గాను 59 లక్షలు వసూల్ చేసింది. 


సైరా జోరు మాత్రం ఈ 15 వ రోజుకు గాను కలెక్షన్స్ బాగా తగ్గాయి. అయితే, ముందు నుండి సినిమా పై హైప్ తగ్గింది. మేకప్ వేసి మాయ చేసాడనే వార్తతో ఎదో మాటలను మూట కట్టుకున్న కూడా మొత్తంగా 15 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.103.74 కోట్ల షేర్ రాబట్టింది ‘సైరా’. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే మొత్తం షేర్ రూ. 138.23 కోట్లుగా ఉంది. గ్రాస్ సుమారు రూ. 227 కోట్లు వసూల్ చేసిందనే చెప్పాలి. ఇంకా కలక్షన్స్ ఏమాత్రం వస్తాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: