సినీ ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా పని చేస్తే వారి వారసత్వం గా వచ్చేవాళ్ళు అదే పని చేయాలా వాళ్ళ జీవితాలు మారవా అంటూ గిన్నిస్ బుక్ రికార్డ్ కమెడియన్ బ్రహ్మానందం వెల్లడిస్తున్నారు. మా పిల్లలు కూడా అందంగా ఉంటారు వారు కూడా ఇప్పుడున్న హీరోలకు ఏ మాత్రం తీసిపోరు అంటూ ఆయన ఓ ఈవెంట్లో వెల్లడించారు. అది నిజమే అనుకోండి. 


ఇకపోతే కమెడియన్ గౌతమ్ రాజు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తన ఫైర్ ఉన్న నటనతో కామెడీని పండించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఈ మధ్య సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే చాలా సినిమాలలో నటించాడు కొన్ని సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు వహించారు కూడా. ఆయన కొడుకు ఇప్పుడు సినిమాలలో నటిస్తున్నాడు. 


వివరాల్లోకి వెళితే.. బిజిఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టివి స్టూడియోస్‌ బ్యానర్‌ పై ప్రముఖ కమెడియన్‌ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా 'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌'.రేపు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జె ఆర్ సి లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆడియో బిగ్ సిడి ని, నటుడు బ్రహ్మనందం ట్రైలర్ విడుదల చేశారు..


గౌతమ్ రాజు నిర్మాత గా ఎదగడానికి చాలా కష్టపడ్డారని చాలా మంది అతని గురించి పొగుడుతూ ఈవెంట్ మొత్తానికి ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్ చాలా బాగాచేసింది. సినిమా మంచి హిట్ అయ్యి జనం అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇక ఈవెంటుకు కమెడియన్ కృష్ణభగవాన్, ఆలీ రాజీవ్ కనకాల, తుమ్మల పల్లి రామ సత్యనారాయణ, చిట్టిబాబు, రచ్చ రవి, తదితరులు హాజరయ్యారు.  రేపు ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: