బ్యూటిఫుల్ పూజా హెగ్డే కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో ముందు పరిచయమైనప్పటికి బాలీవుడ్ కెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంది. అందులో భాగంగా హృతిక్ రోషన్ తో మొహంజాదారో వంటి భారీ బడ్జెట్ సినిమాలో నటించింది. అంతేకాదు ఆ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకుంది. ఒకవేళ ఆ సినిమా గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక పూజా టాలీవుడ్ వైపు చూసేది కాదేమో. కానీ తన అనుకున్నట్టు జరక్కపోగా మళ్ళీ వెంటనే బాలీవుడ్ లో సినిమా పడలేదు. సరిగ్గా అదే సమయంలో హరీష్ శంకర్.. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన దువ్వాడ జగన్నాధం తో మళ్ళీ తెలుగు వైపు వచ్చింది. ఆ సినిమా యావరేజ్ అయినా వరుసగా తెలుగులో భారీ సినిమాలే కాదు స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది. 

దాంతో రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచేసింది. వాస్తవంగా చెప్పాలంటే పూజ కెరీర్ లో ఇప్పటివరకూ ఒక్కటి కూడా సూపర్ హిట్ లేదు. కానీ డిమాండ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంది. ఇక పూజా చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో బాలీవుడ్ ప్రాజెక్ట్ 'హౌస్ ఫుల్ 4' ఈ నెల 25 న రిలీజ్ అవుతోంది.  అల్లు అర్జున్ తో నటిస్తున్న 'అల వైకుంఠపురములో' జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.  ఈ రెండూ కాకుండా ప్రభాస్ కొత్త సినిమా 'జాన్' కూడా లైన్లో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

ఇక పూజా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'జాన్'(వర్కింగ్ టైటిల్) గురించి.. ప్రభాస్ తో పనిచేయడం గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. "సినిమా కథ 1970 లలో ఐరోపాలో జరుగుతుంది.. భారీ స్కేల్ ఉన్న సినిమా. నేను ఇప్పటివరకూ చేసిన బెస్ట్ స్క్రిప్టులలో 'జాన్' ఒకటి" అని చెప్పింది. ప్రభాస్ ఫిలిం ఒక పరిణతి ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రేమ కథ అని.. ఈ సినిమాలో పాత్రకోసం ప్రత్యేకగా ప్రిపేర్ అవ్వాల్సి వచ్చిందని తెలిపింది.

అంతేకాదు ప్రభాస్ గురించి మాట్లాడుతూ "ప్రభాస్ చాలా కూల్ గా ఉంటారు. ప్రభాస్ ఓ ఫుడ్ లవర్. ఆయనకు తినడం అన్నా.. తినిపించడం అన్నా ఎంతో ఇష్టం. మా సెట్ కు ప్రభాస్ రుచికరమైన భోజనం తెప్పించేవారు" అంటూ 'జాన్' షూటింగ్ విశేషాలను పంచుకుంది. 'బాహుబలి' లాంటి సినిమా ప్రభాస్ లాంటి మంచి వ్యక్తికి లభించడం గొప్ప విషయం అని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలిపింది. ఈ రకంగా పూజా వ్యాఖ్యలు చూస్తుంటే ప్రభాస్ తో 'జాన్' సినిమాలో నటించడం పట్ల ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో ఉందని అర్థమవుతోంది. ఇక పూజా సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: