టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ బిజీ హీరోయిన్ ఎవరంటే చెప్పే హీరోయిన్ల పేర్లలో పూజా హెగ్డే మొదటి వరుసలో ఉంటుంది. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అటుపై బాగానే అవకాశాలు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఈ భామకు ట్రాక్ రికార్డ్ కూడా బాగానే ఉంది. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెర మీద పోషించాలనుకుంటున్న కోరికల చిట్టా బయటపెట్టింది.

 

 

టాలీవుడ్ తోపాటు అడపాదడపా బాలీవుడ్ సినిమాలు కూడా చేసే పూజ హెగ్డేకు గ్లామర్ పాత్రలు వేయడమంటే ఇష్టమంటోంది. ప్రస్తుతం తన వయసుకు అవి బాగా సూటవుతాయని అంటోంది. అంతేకాకుండా.. భవిష్యత్తులో రాణి, క్రీడాకారిణి, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలనుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. తాను చేయాలనుకున్న పాత్రలు లిస్ట్ రాస్తే ఓ పుస్తకం తయారవుతుంది అని కూడా చెప్పింది. అనేక క్యారెక్టర్లను తాను ఊహించుకుంటానని అవన్నీ చేయాలని కోరుకుంటూ ఉంటానని తన మనసులోని భావాలను బయటపెట్టింది. ఆ క్యారెక్టర్లను తాను సూటవుతానో లేదో తనకు తెలీదు కానీ  వాటిలో కొన్నైనా చేస్తాననే నమ్మకముందని చెప్పింది. అమ్మడి కోరికల చిట్టా పెద్దదే అయినా నటన మీద ఇష్టం ఉంటేనే ఇలా ఎవరైనా చెప్పగలరు. ఇప్పటికే తెలుగులో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాల్లో నటిస్తూ నటనలో, గ్లామర్ లో మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ భామకు ఏ పాత్ర ఇచ్చినా చేసేయగలదు.

 

 

ప్రస్తుతం బాలీవుడ్ లో చేసిన హౌస్ ఫుల్ 4 కు సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా ఉన్న పూజా పలు నగరాలు చుట్టేస్తోంది. తెలుగులో బన్నీతో అల వైకుంఠపురం సినిమాలో నటిస్తోంది. త్వరలో ప్రభాస్ సరసన జాన్ సినిమాలో కూడా పూజానే హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: