అందాల విందు చేయడమే కాదు, అభినయంతోనూ మెప్పిస్తూ తెలుగు ప్రేక్షకులను కిర్రెక్కిస్తోంది RX100 హీరోయిన్.  లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టింది  పాయల్ రాజ్‌పుత్. ఆ డబ్బు సంపాదించడం కోసం ఏడాది కష్టపడింది. తొలి చిత్రం RX100' తో టాలీవుడ్ లో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుందీ ఈ పంజాబీ భామ. తాజాగా‘RDX లవ్’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందు కొచ్చినా... ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేదు.


 తాజాగా పాయల్.. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూ కు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది.  లక్ష రూపాయలు చేతిలో పట్టుకుని సినీ అవకాశాలు వెతుక్కుంటూ తొలిసారి ముంబయిలో అడుగుపెట్టానని....  ఆ డబ్బు సంపాదించడం కోసం ఏడాది కష్టపడ్డానని చెప్పింది.  
మొదట్లో ఎన్నో ప్రకటనల్లో నటించి, పలు వేదికలపై వ్యాఖ్యాతగా పనిచేసిందట.  అలా తనని తయారు  నిరూపించుకునేందుకు కష్టపడింది. 


తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎన్నో ఆడిషన్లకు హాజరైనప్పటికీ...  ప్రతిచోటా నాకు తిరస్కారాలే.  కొందరు నా ముఖం దక్షిణాది చిత్రాలకు పనికిరాదనే చెప్పేవారు. కానీ చివరికి ‘ఆర్ఎక్స్‌ 100’ చేసే ఛాన్స్‌ దొరికింది అంటూ తెలిపింది పాయల్. ఇక తనను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీ ఇస్తూ.. తాను చేసుకోబోయే వాడు అందంగా, ఇంత  ఎత్తుండాలనేమీ కాకుండా నాకు తగ్గట్టుగా ఉంటే చాలన్నది. ఇక హాస్య చతురత కలిగి ఉండి....ఏ విషయంలోనైనా అలిగితే బుజ్జగించాలి అంటోంది. చేసుకుంటే ఖచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటా కానీ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిని మాత్రం అస్సలు చేసుకోను అంటూ అంటుంది పాయల్.


 ఈ సందర్భంగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ... మాది ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతి పండగ మా ఇంట్లో ఒక పెద్ద సంబరంలా జరుపుకుంటాం అని తెలిపింది.  ముఖ్యంగా దసరా, దీపావళి లాంటి పండగలైతే చాల ప్రత్యేకంగా చేస్తారట. ఖాళీ దొరికితే చాలు అమ్మతో కలిసి వంట గదిలో దూరిపోయి....అన్ని వంటలూ నేర్చుకుందట.  ముఖ్యంగా పంజాబీ వంటకాలు అదరగొట్టేస్తానంటుంది పాయల్. ప్రస్తుతం మాంసాహారం తినడం మానేశా అంటూ చెప్పింది పాయల్.


మరింత సమాచారం తెలుసుకోండి: