ప్రభాస్ పుట్టినరోజు నిన్న అత్యంత సాదాసీదాగా ఎటువంటి సంచలనాలు లేకుండా జరిగింది. ప్రభాస్ కు ఈపుట్టినరోజు అంతగా జోష్ ను ఇవ్వకపోయినా అతడి అభిమానులు మాత్రం చాలచోట్ల సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రభాస్ దృష్టిని ఆకర్షించదానికి ప్రయత్నించారు. 

అయితే అభిమానులు మాత్రం మూడు కారణాలతో ప్రభాస్ పై బయటకు చెప్పుకోలేని అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి రోజున ప్రభాస్ లేటెస్ట్ మూవీ టైటిల్ ప్రకటన ఉంటుంది అని అనుకున్నారు. అయితే ఎటువంటి ప్రకటన రాలేదు. అదేవిధంగా ప్రభాస్ కొత్త సినిమాలకు సంబంధించిన విషయాలు లీక్ అవుతాయని భావించారు అదీ జరగలేదు.

కనీసం ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన పుట్టినరోజునాడు తన అభిమానులకు ‘హాయ్’ అని అయినా చెపుతాడని భావించారు. అయితే ప్రభాస్ పూర్తిగా నిన్న మౌనముద్రలో ఉన్నాడు. అయితే తన అభిమానులను పలకరించని ప్రభాస్ నిన్నటి తన పుట్టినరోజునాడు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా శుభాకాంక్షలు చెప్పడం ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 

కత్రినా కైఫ్ లేటెస్ట్ గా ఒక కాస్మోటిక్ కంపెనీ మొదలు పెట్టింది. ఆమె వ్యాపారం అభివృద్ధి చెందాలని ప్రబాస్ ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసి తన అభిమానులను మాత్రం మరిచిపోవడం అభిమానులకు అసహనాన్ని కలిగించింది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ జిల్ రాథాకృష్ణల మూవీకి ‘జాన్’ అన్న టైటిల్ కు బదులు ‘అమౌర్’ అన్న టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ లో నిన్న ఈ మూవీ టైటిల్ ప్రకటన జరగలేదు అని అంటున్నారు. ఓల్డ్ ఇంగ్లీష్ భాషలో ‘అమౌర్’ అంటే ‘ప్రేమ వ్యవహారం’ అన్న అర్ధం వస్తుందట. ఈ మూవీ కథ 1980 ప్రాంతంనాటిది కాబట్టి టైటిల్ కూడ పాత ఇంగ్లీష్ పదంతోనే ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు రావడంతో నిన్న జరగవలసిన టైటిల్ ప్రకటన రాలేదు అని తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: