2019 సంక్రాంతి పండుగ సందర్భంగా రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా విడుదలైంది. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా నిర్మించిన డీవీవీ దానయ్యకు కూడా భారీ నష్టాలు వచ్చాయి. వినయ విధేయ రామ సినిమా శాటిలైట్ రైట్స్ స్టార్ మా యాజమాన్యం భారీ మొత్తానికి తీసుకుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమా టెలికాస్ట్ అయిన సమయంలో రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కాగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు 14.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు హిట్టైనా, ఫ్లాప్ అయినా బుల్లి తెర మీద మాత్రం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తాయి. 
 
కానీ అందుకు భిన్నంగా వినయ విధేయ రామ సినిమా కేవలం 7.85 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకుంది. సాధారణంగా స్టార్ మా ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యే సినిమాలకు రేటింగ్స్ ఎక్కువగా వస్తాయి. కానీ వినయ విధేయ రామ సినిమా మాత్రం వెండితెర మీద మాత్రమే కాదు బుల్లితెర మీద కూడా డిజాస్టర్ అనిపించుకుంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా 19.5 టీఆర్పీ రేటింగ్ సాధించగా వినయ విధేయ రామ అందులో సగం కూడా సాధించలేకపోయింది. 
 
స్టార్ హీరోల సినిమాలు భారీ మొత్తాలకు కొనుక్కుంటున్న ఛానెల్స్ ఇంత తక్కువగా టీఆర్పీ వస్తూ ఉండటంతో నష్టాలపాలవుతున్నాయి. మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తుంటే స్టార్ హీరోల సినిమాలు మాత్రం టీవీ ఛానెల్స్ ను ముంచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం టీవీలో టెలికాస్ట్ అయిన మహర్షి సినిమా కూడా కేవలం 9.2 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: