‘‘వంగవీటి’’ఫేం సందీప్ మాధవ్  (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ ‘‘జార్జ్ రెడ్డి’’.. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’  బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది..ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ ‘‘జార్జ్ రెడ్డి’’ సినిమా రిలీజ్ కు రెడీ అయింది..ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని నవంబర్ 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.


 ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ: ‘‘కేవలం ఒక్క ట్రైలర్ తోనే మా ‘‘జార్జ్ రెడ్డి’’ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బిజెనెస్ పరంగా కూడా మాకు మంచి ఆఫర్లు వచ్చాయి.చివరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ -అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. వారికి థాంక్స్. సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ట్రైలర్ ఏ విధంగా ఇంట్రస్టింగ్ గా ఉందో..సినిమా కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. మా దర్శకుడు ఈ సినిమాను రియలిస్టిక్ గా తీసాడు. ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం. బయోపిక్ యే అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.అలాంటి కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.


ప్రముఖ హీరో సత్య దేవ్ ఓ మెయిన్ రోల్ చేసిన ఈ సినిమాలో ముస్కాన్, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్‌వ‌ర్మ, తిరువీర్, అభయ్, మహాతి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సాంకేతికవర్గానికి విషయానికి వస్తే.. సంచలనాత్మక మరాఠి సినిమా ‘‘సైరాత్’’కు ఫొటోగ్రఫీ అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు కుడా ఫొటోగ్రఫీని అందించారు. ప్రముఖ మరాఠీ నటి దేవిక ‘‘జార్జి రెడ్డి’’ తల్లి పాత్రలో నటించటం విశేషం. ఇటీవల "నాల్" సినిమాకు గాను బెస్ట్ చైల్డ్‌ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్న శ్రీనివాస్ పోకలే ఈ సినిమాలో చిన్ననాటి జార్జ్ రెడ్డి పాత్రను పోషించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: