ఒకప్పటి కమెడియన్., ఇప్పటి టాలీవుడ్ నిర్మాత., తెలుగు వారికి బాగా పరిచయస్థుడు., బండ్ల గణేష్ ఇప్పుడు పోలీసుల చేతిలో పడ్డాడు.. టెంపర్ సినిమా కోసం పీవీపీ నుంచి కొంత ధనాన్ని బండ్ల గణేష్  ఫైనాన్స్ కింద తీసుకోవడం., దాని తర్వాత సినిమా విడుదల సమయంలో బండ్ల గణేష్ అసలు మొత్తాన్ని పీవీపీ కి చెల్లించి మరికొంత మొత్తానికి గానూ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిలిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. బండ్ల గణేష్‌కు ఫోన్ చేసి పీవీపీ డబ్బులు అడిగారు. దీంతో.! ఆగ్రహానికి లోనైన బండ్ల గణేష్.. మరియు అతనికి సంబంధించిన కొంతమంది మనుషులు కలిసి డబ్బులు అడగడంతో.. పీవీపీ ఇంటికి వెళ్ళి బెదిరించారు.

 

అహం దెబ్బ తిన్న పీవీపీ ఆగ్రహం తో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్లో గణేశ్‌తో పాటు అతని అనుచరులపై ఈ నెల 5వ తేదీన ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి మనకు తెలిసిందే.. అయితే పీవీపీ ఫిర్యాదు చేసిన ఈ చెక్‌ బౌన్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన సినీ నిర్మాత గణేష్ కు న్యాయస్థానం వారు దాదాపుగా 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు.. అయితే ఈ వదంతులు ముగియక ముందే బండ్ల గణేష్ పై ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది..

 

గతంలో 2014 అక్టోబర్‌ 1న కడపకు చెందిన మహేశ్‌ అనే వడ్డీ వ్యాపారి వద్ద వ్యాపారం పేరుతో గణేష్‌ రూ.10 లక్షలు అప్పు తీసుకొని., డబ్బును తిరిగి ఇవ్వకుండా చెల్లని చెక్ నిచ్చారు. ఈ చెక్‌ బౌన్స్‌ కావడంతో వ్యాపారి నేరుగా పోలీసులను ఆశ్రయించాడు.. అయితే సంబందిత కేసు విచారణకు గణేష్ హాజరు కాకపోవడంతో అతనిపై సెప్టెంబర్‌ 18న  అరెస్ట్‌ వారంట్‌ జారీ చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు కడప జైలుకు తరలిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ కోసం బండ్ల గణేష్‌ను పోలీసులు నేటి గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి కడపకు తీసుకువచ్చి జిల్లా న్యాయస్థానం ముందు హాజరు పరిచారని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: